Tilak Varma : దుబాయ్ : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగింది. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. వచ్చీ రావడంతోనే భారత బౌలర్లను ఉతికి ఆరేశారు పాకిస్తాన్ ఆటగాళ్లు. పవర్ ప్లే లో ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. దీంతో ఆ జట్టు 200 రన్స్ కు పైగా చేస్తుందని అంతా భావించారు . కానీ సీన్ రివర్స్ అయ్యింది. పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు కుల్దీప్ యాదవ్. సూపర్ బౌలింగ్ తో కట్టడి చేశాడు. ఏకంగా 4 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రాతో పాటు కుల్దీప్ యాదవ్ మెరిశాడు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.
Tilak Varma – Asia Cup 2025 Finals
దీంతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడకుండానే చాప చుట్టేసింది. 146 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన టీమిండియాకు చుక్కలు చూపించారు పాకిస్తాన్ బౌలర్లు. అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ , శుభ్ మన్ గిల్ తీవ్ర నిరాశకు గురి చేశారు. ఈ సమయంలో భారత్ స్కోర్ కేవలం 21 రన్స్ మాత్రమే. ఈ సమయంలో గ్రౌండ్ లోకి దిగాడు సంజూ శాంసన్. తిలక్ వర్మతో (Tilak Varma) కలిసి కుదుట పరిచాడు. భారీ షాట్ కొట్టబోయి 24 రన్స్ కే అవుట్ అయ్యాడు. తిలక్ వర్మతో కలిసి 54 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన శివం దూబే 33 రన్స్ తో హోరెత్తించాడు. తిలక్ వర్మ అత్యంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో మెరిశాడు. తను 69 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. జట్టును విజేతగా నిలిపాడు.
Also Read : IND vs PAK Asia Cup 2025 Victory : టీమిండియా ఆసియా కప్ విజేత



















