విజయవాడ : ఆరోగ్యమే మహా భాగ్యం అని, దానిపైన ఎక్కువగా దృష్టి సారించాలని అన్నారు దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. గురువారం నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (NATS) సౌజన్యంతో గుడివాడ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఆరోగ్య శిబిరంలో ముఖ్య అతిథిగా తనను పిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. నార్త్ అమెరికా తెలుగు సంఘం చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, 30 మంది స్పెషలిస్ట్ వైద్యులు, టెనెట్ డయాగ్నస్టిక్స్ సేవలు అందిస్తున్న ఇతర సిబ్బందిని నేను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నానని అన్నారు.
ఆరోగ్యం గొప్ప సంపద అని స్పష్టం చేశారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. వ్యాధి తర్వాత చికిత్స కంటే నివారణ ఉత్తమం అని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని స్పష్టం చేశారు. సమతుల్య ఆహారం తీసుకోవాలని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు. బ్లడ్ ఫ్రెషర్ , మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యంపైన కంటే ఆదాయంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని , దీని కారణంగా సమతుల్యత లోపించిందన్నారు.
