మోదీని క‌లిసిన తిరువ‌నంత‌పురం కార్పొరేట‌ర్లు

అభినంద‌న‌ల‌తో ముంచెత్తిన ప్ర‌ధాని మోదీ

hellotelugu-PMModi

న్యూఢిల్లీ : ఢిల్లీలో అరుదైన స‌న్నివేశానికి వేదికైంది. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు కేర‌ళ రాష్ట్రం తిరువ‌నంత‌పురం న‌గ‌ర మేయ‌ర్, కార్పొరేట‌ర్లు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర‌న్ ఆధ్వ‌ర్యంలో వీరంతా భేటీ అయ్యారు. కేర‌ళ రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. కేర‌ళ అంటేనే వామ‌ప‌క్ష పార్టీకి పెట్ట‌ని కోట‌. ఇక్క‌డ ఎంపీగా ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌, ర‌చ‌యిత శ‌శి థ‌రూర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎంపీగా ఉన్నారు. ఊహించ‌ని విధంగా ఇక్క‌డ ఆ పార్టీకి పెద్ద దెబ్బ ప‌డింది. చివ‌ర‌కు బీజేపీ జెండా ఎగుర వేసింది.

వామ‌ప‌క్షానికి పెట్ట‌ని కోట‌గా ఉన్న కేర‌ళ రాష్ట్రంలో ఉన్న‌ట్టుండి జ‌నం కాషాయం వైపు మ‌ళ్ల‌డం విస్తు పోయేలా చేసింది. ప్ర‌ధాన‌మంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా పెద్ద ఎత్తున ఇక్క‌డ ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌చారంలో పాల్గొన్నారు. విస్తృతంగా హామీలు ఇచ్చారు. భారీ ఎత్తున నిధులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. వారి వ్యూహం ఫ‌లించింది. జ‌నం కాషాయానికి జేజేలు ప‌లికారు. తొలిసారిగా తిరువ‌నంత‌పురం న‌గ‌రంపై బీజేపీ జెండా రెప రెప లాడింది. ఇది కేర‌ళ‌లో కొలువు తీరిన సీపీఎం పార్టీకి, ప్ర‌ధానంగా సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కు కోలుకోలేని షాక్. ఇదిలా ఉండ‌గా ఇక్క‌డ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన మేయ‌ర్, కార్పొరేటర్ల‌ను పిలిపించారు మోదీ. వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Exit mobile version