తెలంగాణ కులాల సర్వేలో టాప్ కులాలు ఇవే

మొత్తం 35 కులాలకు చెందిన జ‌నాభా ఎక్కువ‌

hellotelugu-TelanganaCasteCenssus

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఏయే కులాలు ఉన్నాయ‌నే దానిపై వివ‌రాలు వెల్ల‌డించింది తెలంగాణ గణాంక స‌ర్వే. ఈ మేర‌కు నివేదిక‌ను రిలీజ్ చేసింది. అత్య‌ధిక కులాలు 35 ఉన్నాయి. మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌నాభా 36.58 ల‌క్ష‌లు ఉండ‌గా షేక్ ముస్లిం జ‌నాభా 27.96 ల‌క్ష‌లు, ముదిరాజ్ సామాజిక వ‌ర్గం 26.39 ల‌క్ష‌లు , లంబాడీలు 24.04 ల‌క్ష‌లు, యాద‌వ సామాజిక వ‌ర్గం 20.19 ల‌క్ష‌లు ఉన్న‌ట్లు తేల్చింది. ఇక అధికారాన్ని అనుభ‌విస్తున్న రెడ్డి సామాజిక వ‌ర్గం 17.10 ల‌క్ష‌లు, గౌడ సామాజిక వ‌ర్గం 16.30 ల‌క్ష‌లు, మాల సామాజిక వ‌ర్గం 14.72 ల‌క్ష‌లు, మున్నూరు కాపు సామాజిక వ‌ర్గం 113.75 ల‌క్ష‌ల జ‌నాభా ఉందంటూ తేల్చారు.

ఇక ప‌ద్మ‌శాలి సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌నాభా 11.82 ల‌క్ష‌లు, ర‌జ‌క కుల‌స్తులు 9.66 ల‌క్ష‌లు, కుర‌మ సామాజిక వ‌ర్గం 7.96 ల‌క్ష‌లు, వడ్డెర జ‌నాభా 6.44 ల‌క్ష‌లు, ముస్లింలు 6.33 ల‌క్ష‌లు, అగ్నికుల క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం 5.27 ల‌క్ష‌లు, ఆర్య వైశ్యులు 4.34 ల‌క్ష‌లు, కుమ్మ‌ర సామాజిక వ‌ర్గం జ‌నాభా 4.31 ల‌క్ష‌లు, కోయ సామాజిక వ‌ర్గం 4.28 ల‌క్ష‌లు, వ‌డ్రంగి జ‌నాభా 4.08 లక్ష‌లు, గోండు జ‌నాభా 3.82 ల‌క్ష‌లు, క‌మ్మ సామాజిక వ‌ర్గం 3.68 ల‌క్ష‌లు, వాల్మీకి బోయ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌నాభా 3.59 ల‌క్ష‌లు, బ్రాహ్మ‌ణుల జ‌నాభా 3.36 ల‌క్ష‌లు, దూదేకుల సామాజిక వ‌ర్గం 2.70 ల‌క్ష‌లు, కాపు నాయుడు జ‌నాభా 2.42 ల‌క్ష‌లు, పెరిక జ‌నాభా 2.31 ల‌క్ష‌లు, బేడా కుల‌స్థులు 1.90 లక్ష‌లు, ఎరుకులి జ‌నాభా 1.85 ల‌క్ష‌లు, వీర‌శైవ లింగాయ‌త్ జ‌నాభా 1.73 ల‌క్ష‌లు, కుమ్మ‌రి జ‌నాభా 1.66 ల‌క్ష‌లు, దోబి ముస్లిం 1.26 ల‌క్ష‌లు, ఉప్ప‌ర కులం 1.24 లక్ష‌లు ఉన్న‌ట్లు తేల్చింది స‌ర్వే.

Exit mobile version