సీఎంకు వ్య‌వ‌సాయ క‌మిష‌న్ నివేదిక స‌మ‌ర్ప‌ణ

కీల‌క సూచ‌న‌లు చేసిన క‌మిష‌న్ చైర్మ‌న్, స‌భ్యులు

hellotelugu-Commission

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక విభాగాలతో కూడిన ప్రత్యేక చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది ఈ నివేదిక‌లో. ఈ కమిషన్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. శనివారం నాడు చిన్న నీటిపారుదల అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు క‌మిష‌న్ చైర్మ‌న్ , స‌భ్యులు. చిన్న , పెద్ద నీటిపారుదల వనరులను అనుసంధానించడానికి ‘కమాండ్ ఏరియా’ (నీటి పారుదల పరిధి) ఆధారిత నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కమిషన్ త‌న నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది.

చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చిన్న నీటిపారుదల చట్టాన్ని రూపొందించాలని కోరింది. అలాగే చెరువుల పూర్తి నీటి మట్టం (FTL) సరిహద్దులను వెంటనే గుర్తించి, ఆక్రమణలను తొలగించి వాటిని రక్షించాలని కమిషన్ సలహా ఇచ్చింది. తెలంగాణలో నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ , గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ అవసరమని కమిషన్ పేర్కొంది. పంట మార్పిడి, ఉద్యాన పంటల సాగును పెంచడం , రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOలు) ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు ఈ సంద‌ర్బంగా . గత రెండేళ్లలో తాము చేపట్టిన కార్యక్రమాలు , ప్రభుత్వానికి అందించిన సూచనల గురించి కమిషన్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. కమిషన్ పనితీరు పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

Exit mobile version