విప‌క్షాల ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేదు : స్పీక‌ర్

వారు మాట్లాడితేనే ప్ర‌జాస్వామ్యం గెలుస్తుంది

hellotelugu-OmBirla

న్యూఢిల్లీ : లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న ప‌నితీరు బాగోలేద‌ని ప్ర‌తిప‌క్షాలు పార్ల‌మెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా స్పీక‌ర్ స్పందించారు. స‌భా వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స్పీక‌ర్ గా త‌న‌కు మ‌రోసారి అవ‌కాశం రావ‌డానికి తాను నిష్ప‌క్ష పాతంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లేన‌ని గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. తాను ప్ర‌జాస్వామిక బ‌ద్దంగా ప‌ని చేస్తున్నాన‌ని, ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌జా దేవాల‌యంగా భావించే పార్ల‌మెంట్ లో మాట్లాడేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో విప‌రీత అర్థాలు వెత‌క‌వ‌డం మానుకోవాల‌ని సూచించారు. త‌న‌కు ఏ ఒక్క‌రి ప‌ట్ల ద్వేషం అనేది ఉండ‌ద‌న్నారు.

భార‌త రాజ్యాంగం ప్ర‌కారం తాను స్పీక‌ర్ గా త‌న ప‌రిమితులు, ప‌రిధి ఏమిటో తెలుస‌ని పేర్కొన్నారు ఓం బిర్లా. కానీ విప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. విపక్షాల గొంతు నొక్కుతున్నానని నాపై ఆరోపణలు చేయ‌డం త‌న‌ను మ‌రిం బాధ‌కు గురి చేసింద‌న్నారు. అవిశ్వాస తీర్మానంపై 12 గంటలకు పైగా చర్చ జరిగింద‌ని చెప్పారు. విపక్షాలు మాట్లాడినప్పుడే ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. ఈ పార్లమెంట్ 140 కోట్ల భారతీయులకు ప్రతిబింబం అన్నారు. సభా నియమాలకు కట్టుబడి అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం జరుగుతుందని స్ప‌ష్టం చేశారు స్పీకర్ ఓం బిర్లా.

Exit mobile version