ముంబై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్ చిరకాలం గుర్తుండి పోతుంది. ఇండియా ఇంగ్లండ్ ను 7 రన్స్ తేడాతో ఓడించింది. ఫైనల్ కు వెళ్లింది. ఈనెల 8న అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది న్యూజిలాండ్ తో. భారత జట్టు సమిష్టిగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో టీమిండియా సత్తా చాటింది. టాస్ ఓడి పోయిన భారత్ ముందుగా మైదానంలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇందులో శాంసన్ 89 రన్స్ చేస్తే ఇషాన్ కిషన్ 38, శివమ్ దూబే 44, పాండ్యా 26, తిలక్ వర్మ 27 రన్స్ తో తమ వంతు పాత్ర పోషించారు. 534 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి ఓవర్ దాకా వచ్చింది ఇంగ్లండ్. ఆ జట్టుకు చెందిన 22 ఏళ్ల కుర్రాడు విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు.
తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. చివరి వరకు తీసుకు వెళ్లాడు తన జట్టును. అక్షర్ పటేల్ క్యాచ్ లు, పాండ్యా చేసిన రనౌట్ తో పాటు ఇండియా స్పీడ్ స్టర్ గా పేరు పొందిన కీలకమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తను ఏమిటో మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఒకానొక దశలో ఇండియా ఆశలు సన్నగిల్లాయి. కానీ తను 16, 18వ ఓవర్ లో వేసిన బంతులు ఇంగ్లండ్ ను కట్టడి చేశాయి. దీంతో ఇండియా విజయం ఖాయమై పోయింది. కేవలం 7 పరుగుల తేడాతో విజయం సాధించినా చరిత్ర సృష్టించింది భారత జట్టు. చిరస్మరణీయమైన వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. కీవీస్ తో తాడో పేడో తేల్చుకోనుంది. ఈ సందర్బంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైన సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ అవార్డు నాకు కాదు ఇవ్వాల్సింది బుమ్రాకు అని అన్నాడు.
