బిగ్ బాస్ -9 విజేత‌కు భారీ ప్రైజ్ మ‌నీ

రేపే గ్రాండ్ ఫినాలే కోసం భారీ ఏర్పాట్లు

hellotelugu-BigBoss-9PrizeMoney

హైద‌రాబాద్ : ల‌క్ష‌లాది మందిని మెస్మ‌రైజ్ చేస్తూ కొన్ని రోజులుగా వినోదాన్ని పంచుతూ వ‌చ్చిన బిగ్ బాస్ -9 సీజ‌న్ ఈనెల 21న ఆదివారం నాటితో ముగియ‌నుంది. రాత్రి 7 గంట‌ల‌కు బిగ్ బాస్ -9 షో విజేత ఎవ‌రు అనేది తేలి పోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఓటింగ్ లో నువ్వా నేనా అన్న‌ట్టుగా సాగింది. కానీ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది ఏమిటంటే ముగ్గురి కంటెస్టెంట్స్ మ‌ధ్య‌నే ఉండింది. అయితే ప్ర‌స్తుతం ఓటింగ్ లో నిన్న‌టి దాకా టాప్ లో కొన‌సాగుతూ వ‌చ్చిన త‌నూజ ఉన్న‌ట్టుండి వెనుక‌బ‌డి పోవ‌డం విస్తు పోయేలా చేసింది. మొద‌టి నుంచి చివ‌రి దాకా అన్ని టాస్క్ లను క్లియ‌ర్ చేసుకుంటూ ఫైన‌ల్ దాకా వ‌చ్చింది త‌ను. కానీ ఫైన‌ల్ ఓటింగ్ లో ముగ్గురు పోటీ ప‌డ్డారు. ఇందులో కళ్యాణ్ , ఇమ్మాన్యూయెల్, త‌నూజ ఉన్నారు. తాజాగా అందిన విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం క‌ళ్యాణ్ నెంబ‌ర్ వ‌న్ లో ఉండ‌గా నెంబ‌ర్ 2లో ఇమ్మాన్యూయెల్, నెంబ‌ర్ త్రీలో తనూజ ఉండ‌డంతో అస‌లు విజేత ఎవ‌రో తేలి పోయింద‌ని టాక్.

ఇక బిగ్ బాస్ -9 రియాల్టీ షో గ్రాండ్ ఫినాలే కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈకార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవితో పాటు మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ మూవీ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కూడా హాజ‌రు కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌న‌వ‌రిలో ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ద్వారా మూవీ ప్ర‌మోషన్ కూడా అవుతుంద‌ని భావించార‌ని, అందుకే న‌టుడు, డైరెక్ట‌ర్ ఓకే చెప్పార‌ని టాక్. బిగ్ బాస్ -9 విజేత ఎవ‌రైనా స‌రే భారీ ప్రైజ్ మ‌నీ ద‌క్క‌నుంది. గెలుపొందిన వారికి రూ. 50 ల‌క్ష‌ల బ‌హుమ‌తి ల‌భిస్తుంది. ఆ అదృష్ట జాత‌కులు ఎవ‌రో తేలాలంటే రేప‌టి దాకా ఆగాల్సిందే.

Exit mobile version