పోలవరం : పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం మూడు రోజుల పర్యటన ముగిసింది. ఈ నిపుణులు రాజమహేంద్రవరం లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ ఎం. రమేష్ కుమార్ తో సమావేశం అవుతారు. శుక్రవారం అథారిటీ సి ఈ ఓ తో ఢిల్లీలో భేటీ కానున్నారు విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకో, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి , మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా , రవి అగర్వాల్ , , పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, చీఫ్ ఇంజనీర్ ఎం. రమేష్ కుమార్ ,ఎన్ ఐ ఆర్ ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతానిలతో కలిసి మూడు రోజుల్లో గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జి హిల్, ప్రధాన డాం ఎగువ, దిగువ భాగాలు, డి వాల్ , డీ వాటరింగ్ ఛానల్, రాక్ ఫిల్, క్లే స్టాక్, మెయిన్ డాం గ్యాప్ 1 లో మట్టి పటిష్టత ఎలా ఉందొ తొమ్మిది గంటలపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆ తరువాత 12 గంటలపాటు సమీక్షించారు. తాము పరిశీలించిన అంశలపై తోలి రెండు రోజులు కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ భక్షి అధ్యక్షతన సమావేశమై చర్చించారు. మూడో రోజు జరిగిన సమావేశానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ ఎం. రమేష్ కుమార్ అధ్యక్షత వహించారు. మూడు రోజులపాటు జరిగిన క్షేత్రస్థాయి పరిశీలన, సమీక్ష సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఎం. వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సి కే నరసింహమూర్తి, ఎస్ ఈ ఆర్ రామచంద్ర రావు, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి పాల్గొని విదేశీ నిపుణులు, కేంద్ర ప్రభుత్వ అధికారుల సందేహాలు నివృత్తి చేశారు.

















