చైనా సైనిక విన్యాసాల‌పై అమెరికా క‌న్నెర్ర

అన‌వ‌స‌ర ఉద్రిక్త‌త‌లు పెంచుతాయని ఫైర్

hellotelugu-America

అమెరికా : పెద్ద‌న్న అమెరికా డ్రాగ‌న్ చైనా తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే ప‌దే ప‌దే తైవాన్ ను టార్గెట్ చేయ‌డం ప‌ట్ల మండిప‌డింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్బంగా చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. తైవాన్ దేశం కాద‌ని అది త‌మ భూభాగంలో ఒక భాగ‌మ‌ని, ఎవ‌రు దానికి మ‌ద్ద‌తు ఇచ్చినా ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది అమెరికా. ఈ సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు చేప‌ట్ట‌డం త‌క్ష‌ణ‌మే నిలిపి వేయాల‌ని కోరింది. అనవసరంగా ఉద్రిక్తతలను పెంచుతాయని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

ఈ స‌మ‌యంలో చైనా సంయ‌మ‌నం పాటించాల‌ని కోరింది. తన సైనిక ఒత్తిడిని నిలిపి వేయాలని దానికి బదులుగా అర్థవంతమైన సంభాషణలో పాల్గొనాలని తాము కోరుతున్నామ‌న్నారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ .ఇదిలా ఉండ‌గా చైనా అమెరికా చేసిన విన‌తిని ప‌ట్టించు కోలేదు. బీజింగ్ క్షిపణులను ప్రయోగించింది .డజన్ల కొద్దీ ఫైటర్ జెట్‌లు, నేవీ షిప్‌లు, కోస్ట్‌గార్డ్ నౌకలను మోహరించింది. తైవాన్ ప్రధాన ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేసింది. ఇదే స‌మయంలో అమెరికాతో పాటు ప‌లు దేశాలు తైవాన్ పై దాడుల‌కు దిగ‌వ‌ద్దంటూ చైనాను కోరాయి. అయినా డోంట్ కేర్ అంటూ ముందుకే సాగుతామ‌ని మ‌రోసారి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు జిన్ పింగ్.

Exit mobile version