చిప్‌ కంపెనీలు ఏపీకి వచ్చేలా సహకరించండి

దక్షిణ కొరియాలో భారత రాయబారితో లోకేష్‌ భేటీ

hellotelugu-NaraLokesh

సియోల్ (సౌత్ కొరియా) : ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌తో సియోల్‌లో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శాంసంగ్, ఎల్‌జీ, ఎస్‌కె, ఏఎస్‌ఐపీ–ఏపీఏసీటీ ఓశాట్‌ల ఆధారంగా, ఇండియా సెమీ కండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, చిప్ దిగ్గజాలను ఏపీకి రప్పించేందుకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలలో రెడీ టు యూజ్ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్ర విశ్వ విద్యాలయాలతో కలిసి కొరియా-అనుసంధాన నైపుణ్య కార్యక్రమాలకు (VLSI, ATMP/ప్యాకేజింగ్, SMT, డిస్‌ప్లేలు) సహకరించాలని విజ్జప్తి చేశారు. కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ఏప్రిల్ 2026లో భారత్ పర్యటన సందర్భంగా “కొరియా ఎన్‌క్లేవ్” ఏర్పాటు కోసం చేసిన ప్ర‌తిపాద‌న‌కు కార్య‌రూపం ఇచ్చేందుకు.. కొరియన్ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (SMEs) కోసం ఉద్దేశించిన ఒక ప్లగ్-అండ్-ప్లే టౌన్‌షిప్ కు శ్రీసిటీలో ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని లోకేష్ తెలిపారు.

కొరియా ప్రాధాన్యతారంగ పరిశ్రమలను ఏపీకి తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని కోరారు. అనంతపురంలో కియా/హ్యుందాయ్ మోబిస్ ఆటో-ఈవీ క్లస్టర్‌ను విస్తరించడంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో హెచ్‌డి హ్యుందాయ్ తరహా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌ను ఏర్పాటు, బ్యాటరీ/గ్రీన్-హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. ఏపీ –కొరియా మ‌ధ్య సంబంధాల బ‌లోపేతానికి సహకారం అందించాలని కోరారు నారా లోకేష్‌. కొరియా ప్లస్, KOTRA, భారత్-కొరియా పారిశ్రామిక సహకార కమిటీలను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక ఏపీ–కొరియా డెస్క్ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ఈనెల 10న నిర్వహించే సియోల్ ఇన్వెస్టర్ రోడ్‌షో, G2G అవగాహన ఒప్పందాల వైపు మళ్లించేలా చొరవ చూపాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.

Exit mobile version