అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అల్లూరి జిల్లాలో సూపర్ 50 ఇన్స్పిరేషన్ ఇంజిన్ ఆఫ్ నిర్మాణ్ పేరుతో అమలు చేసిన కార్యక్రమాన్ని ప్రజెంట్ చేశారు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. పదో తరగతి విద్యార్ధులకు మెంటారింగ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా కార్యాచరణ రూపొందించిన కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు సీఎం. ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్ధులకు టీచింగ్ ఎట్ రైట్ లెవల్ అనే విధానంతో నిర్మాణ్ రూపకల్పన చేయడాన్ని ప్రశంసించారు నారా చంద్రబాబు నాయుడు. తెలుగు, ఇంగ్లీష్ ,లెక్కలు సహా అన్ని సబ్జెక్టుల్లో ఇప్పటి వరకూ 90 వేల మంది విద్యార్ధులకు లబ్ది జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. విద్యాశాఖ లాంఛ్ చేసిన ఈ తరహా బెస్ట్ ప్రాక్టీసెస్ ను జిల్లా కలెక్టర్లే డ్రైవ్ చేయాలని స్పష్టం చేశారు. టెక్నాలజీ ద్వారా ఇన్నోవేటివ్ ఐడియాలతో ప్రజలకు ప్రయోజనం కలిగించాలని అన్నారు. విద్యా శాఖలో మంచి ట్రాన్సఫర్మేషన్ జరగాలని పేర్కొన్నారు సీఎం .విద్యార్ధులు రాష్ట్రానికి దేశానికి, యావత్ ప్రపంచానికి భవిష్యత్ ఆస్తులు అని చెప్పారు. కుప్పంలో విలువల బడి అనే కాన్సెప్టును కూడా ప్రారంభించారని తెలిపారు. విద్యార్ధులకు విలువలు నేర్పడంతో పాటు క్రీడలు కూడా నేర్పించాలని అన్నారు సీఎం. నాలెడ్జితో పాటు విద్యార్ధులకు విలువలు కూడా చాలా ముఖ్యమని చెప్పారు. కలెక్టర్లు మరింత ఇంప్రూవ్డ్ మోడల్ తో ఈ తరహా కొత్త విధానాలు అమలు చేయాలని సూచించారు.
