రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ సంస్థ భేష్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి జి. కిష‌న్ రెడ్డి

hellotelugu-RENGY2026

హైద‌రాబాద్ : భారతదేశ ఎనర్జీ భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్స్, పెట్టుబడిదారులు ,సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకు రావాలనే లక్ష్యంతో AI ఆధారిత రెసిడెన్షియల్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ రెంజీ 2026 ను ఏర్పాటు చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి. జాతీయ స్థాయి కాంక్లేవ్ హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రితో పాటు ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, మై హోమ్స్ గ్రూప్ చైర్మ‌న్ రామేశ్వ‌ర్ రావు, సీపీ ర‌మేష్ రెడ్డి, తెలంగాణ రెడ్కో ఎండీ అనిలా వావిళ్ల తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో తొలి సారిగా ఏఐ ఆధారిత సేవలు అదిస్తున్న రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ సంస్థ “రెంజీ (RENGY)” కీ ఫీచర్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.

సమాజంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ‘రెంజీ’ సంస్థ వ్యవస్థాపకుడు ఆకుల మణికంఠ ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. సాంప్రదాయ వనరులపై దేశం అతిగా ఆధారపడకుండా, పర్యావరణాన్ని కాపాడుతూనే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ప్రధాని మోదీ ‘క్లీన్ ఎనర్జీ విప్లవం’ తీసుకొచ్చారని చెప్పారు. ఇవాళ దేశంలో ‘రెన్యూవబుల్ ఎనర్జీ’ వినియోగం అనేది కేవలం ప్రభుత్వ విధానంగా కాకుండా, ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. ఇంటిటింకి సోలార్ కరెంట్ అందించేందుకు పీఎం సూర్య ఘర్ యోజన, రైతులు తమ పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పీఎం కుసమ్ యోజన, ఇందన ఉత్పత్పిలో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిపేందుకు నేషనల్ సోలార్ మిషన్ స్కీంలను కేంద్రం తీసుకు వచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు.

Exit mobile version