హైదరాబాద్ : టీజీ విశ్వ ప్రసాద్ తో పాటు తన కూతురుతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం రాజా సాబ్. మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు పొందిన డైరెక్టర్ మారుతి దీనిని తీశాడు. ఇప్పటికు సినిమాకు సంబంధించిన గ్లింప్స్ , పోస్టర్స్, సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ లో రొమాంటిక్ రోల్ పోషించాడు. ఆ తర్వాత భిన్నమైన రోల్స్ పోషించాడు. సలార్ , బాహుబళి, కల్కి చిత్రాలకు భిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మారుతి. ఇందులో భాగంగా ఈ సినిమా తరుచూ వాయిదా పడుతూ వచ్చింది. కానీ చివరకు మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వరల్డ్ వైడ్ గా రాజా సాబ్ ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో మరింత అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఇవాళ హైదరాబాద్ లో రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ప్రభాస్ అభిమానులు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నగరంలోని కూకట్ పల్లి గ్రౌండ్ లో ఈవెంట్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలోని రోడ్లన్నీ క్రిక్కిరిసి పోయాయి. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ కమిషనర్ కీలక సూచనలు చేశారు నిర్వాహకులకు. ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని, లేక పోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోయాయి. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ కు సహకరించాలని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.


















