చెన్నై : తమిళనాడు శాసన సభలో ముఖ్యమంత్రిగా కొలువు తీరిన అనంతరం సీఎం విజయ్ తొలిసారిగా ప్రసంగించారు. మంగళవారం ఏకగ్రీవంగా టీవీకే పార్టీ తరపున స్పీకర్ గా ప్రభాకర్ ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ గా రవిశంకర్ ఎన్నిక కాగా ఆ ఇద్దరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా ప్రసంగించిన విజయ్ స్పీకర్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తారని, ఆయనకు ఉన్న పవర్స్ ఇంకెవరికీ ఉండవన్నారు. అంతే కాదు స్పీకర్ గురించిన కథను కూడా శాసన సభలో ప్రస్తావించారు.
సభాపతి పదవికి సంబంధించిన ఈ సంప్రదాయం ఇంగ్లాండ్ పార్లమెంటు నుండి ఉద్భవించింది. రాజుల కాలంలో, పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలను రాజుకు తెలియ జేయడం అత్యంత ప్రమాదకరమైన పనిగా ఉండేది. ఒకవేళ రాజుకు ఆ నిర్ణయం నచ్చక పోతే, ఆ వార్తను తీసుకు వచ్చిన సభాపతికి మరణశిక్ష విధించే అవకాశం ఉండేది. దీని ఫలితంగా, సభాపతి పదవిని స్వీకరించడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. అందుకే, సభాపతిగా ఎన్నికైన వారిని బలవంతంగా పట్టుకుని, ఈడ్చుకుంటూ తీసుకువచ్చి, ఆ కుర్చీలో కూర్చోబెట్టే ఆచారం మొదలైందని అన్నారు.
కానీ ఇప్పుడు అలా కాదు. స్పీకర్ పదవికి భారత రాజ్యాంగం గొప్పనైన పవర్స్ ఇచ్చిందని అన్నారు తిరు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. తాము ఎవరి పట్లా వివక్ష చూపించ బోమంటూ ప్రకటించారు. అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సమానమేనని చెప్పారు.
