నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలి : సీఎం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన జోసెఫ్ విజ‌య్

hellotelugu-CMVijay

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ, మోదీ, అమిత్ షా ప్ర‌భుత్వాన్ని ఏకి పారేశారు. ఈ స‌ర్కార్ కొలువు తీరాక లీకుల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంద‌ని ఆరోపించారు. గురువారం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా మే 3వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వ‌హించిన నీట్ – యుజి 2026 ప‌రీక్ష నిర్వ‌హించారు. భారతీయ జ‌న‌తా పార్టీ పాలిస్తున్న గుజ‌రాత్ వేదిక‌గా నీట్ ప‌రీక్ష లీక్ అయ్యింది. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించింది కేంద్రం సీబీఐని. 22 లక్ష‌ల మందికి పైగా విద్యార్థులు నీట్ ఎగ్జామ్ కు హాజ‌ర‌య్యారు. తాజాగా లీకుల ప‌ర్వం నేప‌థ్యంలో ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ సంస్థ ఎన్టీఎస్. దీనిపై తీవ్రంగా స్పందంచారు సీఎం విజ‌య్.

నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరీక్ష వల్ల గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమం విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. వైద్య సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ఇప్పటికే అనేక పరీక్షల ఫలితాలు లీకయ్యాయన్నది అందరికీ తెలిసిన విషయమేన‌ని పేర్కొన్నారు. ప్రతిసారి ఫలితం లీక్ అయినప్పుడు, సాకులు చెబుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సర్వసాధారణమై పోయిందన్నారు . ఆశ్చర్యకరంగా, ఇన్ని లీకులు జరిగినప్పటికీ ఒక్క మంత్రి కూడా ఒక్కసారి కూడా రాజీనామా చేయలేదన‌న్నారు విజ‌య్.

Exit mobile version