మెగా ఐపీఎల్ 2026 సంబురం ప్రారంభం

కీల‌క వేదిక కానున్న చిన్న స్వామి స్టేడియం

hellotelugu-IPL2026

బెంగ‌ళూరు : ప్ర‌పంచ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన టోర్నమెంట్ గా పేరు పొందింది. భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏటా ఐపీఎఎల్ కొన‌సాగుతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే వేల కోట్ల వ్యాపారం దీని చుట్టూ న‌డుస్తోంది. తాజాగా ఐపీఎల్ లోని గ‌త ఏడాది ఛాంపియ‌న్ గా నిలిచిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తో పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయింది. ఇది క్రికెట్ చ‌రిత్ర‌లోనే అరుదైన రికార్డు ధ‌ర ప‌ల‌క‌డం. ఎవ‌రూ ఊహించ లేదు ఇవి ఇంత భారీగా అమ్ముడు పోతాయ‌ని. ఇక ఐపీఎల్ 2026 సీజ‌న్ మార్చి 28న శ‌నివారం నుంచి అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం కానుంది.

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆర్సీబీతో త‌ల‌ప‌డేందుకు రెడీ అయ్యింది స‌న్ రైజ‌ర్స్ ఆఫ్ హైద‌రాబాద్. మొత్తం ఐపీఎల్ మెగా టోర్నీలో 10 జ‌ట్లు ఆడ‌తాయి. అన్ని జ‌ట్లు త‌మ బ‌లాల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. స్వ‌దేశీ, విదేశీ ఆట‌గాళ్ల క‌ల‌యిక‌తో ఉన్న ఈ జ‌ట్లు ఇప్పుడు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించేందుకు సిద్దం అయ్యాయి. టాప్ క్లాస్ ప్లేయ‌ర్లు త‌మ స‌త్తా చాటేందుకు సిద్దం అయ్యారు. మొత్తంగా నిన్న‌టి వ‌ర‌కు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫీవ‌ర్ ఇంకా భారత దేశాన్ని వీడ‌లేదు. ఇప్పుడు ఐపీఎల్ మెగా టోర్న‌మెంట్ ప్రారంభం కావ‌డంతో కోట్లాది మంది అభిమానులు ఊపిరి బిగ‌ప‌ట్టి చూస్తున్నారు ఎవ‌రు గెలుస్తారోన‌ని.

Exit mobile version