హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన సందర్బంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ సమాచారం వస్తుందన్నారు. ఇది పాలనలో ఒక భాగం అన్నారు కేటీఆర్. దీనిని రాద్దాంతం చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఈ గూఢచారి వ్యవస్ధ ఆనాటి నెహ్రు నుంచి నేటి దాకా ఉందన్నారు. శాంతి భద్రతలు, రాష్ట్ర రక్షణ కోసం చేస్తారని ఇది ప్రతి ఒక్కరు గమనించాలని స్పష్టం చేశారు. ఈ రోజు నిఘా వ్యవస్ధ లేదా.. ఫోన్ ట్యాపింగ్ నడుస్త లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేయడం లేదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి చెప్తారా ట్యాప్ చేయడం లేదని అని అన్నారు.
ఇప్పుడున్న డీజీపీ కూడా అప్పుడు అధికారిగా ఉన్నాడని గుర్తు చేశారు కేటీఆర్. అయనకు కూడా నిఘా వ్యవస్ధ గురించి తెలుసు అని పేర్కొన్నారు. ఏవిధంగా నిఘా వ్యవస్థ పనిచేస్తుందో సీఎం, అధికారులు చెప్పరన్నారు. అలా చెబితే ఇబ్బందులు ఏర్పడుతాయని చెప్పారు. వారికున్న నిబంధనల మేరకు ఏవిథంగా సమాచారం వస్తుందో సీఎం అడగరని అన్నారు మాజీ మంత్రి. ఈ సిట్ వంటి డ్రామాలతో ఎన్ని రోజులు ప్రజల దృష్ఠిని తప్పిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అటెన్షన్ డైవర్షన్‌తో ఎన్ని రోజులు కాలం వెల్లదీస్తారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. ఇన్ని సిట్‌లు, విచారణలు, కేసుల పేరుతో సాధించింది ఏమిటి అని అడిగారు.



















