హైదరాబాద్ : ఎవరీ రిద్దీ కుమార్ అనుకుంటున్నారా. తాజాగా తను వైరల్ గా మారింది. ప్రస్తుతం తను పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ తో డేటింగ్ చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాను తను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. దీనికి కారణం లేక పోలేదు హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో జరిగిన మారుతి దర్శకత్వం వహించిన రాజా సాబ్ లో ముఖ్య పాత్ర పోషించింది. తనతో పాటు మరో ఇద్దరు నటీమణులు కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మాళవిక మోహన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా ముఖ్య భూమిక పోషించారు. ఈ సందర్బంగా జరిగిన ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రిద్దీ కుమార్. తను సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
నటుడు ప్రభాస్ గురించి తన మనసులోని మాటను పంచుకుంది. తనకు మూడు ఏళ్ల కిందట తను ప్రేమ పూర్వకంగా చీర బహుమతిగా ఇచ్చాడని తెలిపింది. ఇందు కోసం తాను మూడు సంవత్సరాలు వేచి ఉన్నానని, ఇప్పుడు ఆ కోరిక తీరిందని చెప్పింది నటి రిద్దీ కుమార్. ప్రభాస్ ఇచ్చిన చీరను తాను కట్టుకుని వచ్చానంటూ పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యలు తామిద్దరి మధ్య డేటింగ్ కు పునాది వేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వీరిద్దరి మధ్య లవ్ మొదలైందని అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా రిద్దీ కుమార్ రాధే శ్యామ్ లో ప్రభాస్ సరసన నటించింది. ఆ సినిమా నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని టాక్.


















