భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి ఫ్లైట్ ల్యాండ్

విమాన‌యాన రంగంలో చారిత్రాత్మ‌క ఘ‌ట్టం

hellotelugu-FirstFlight

అమ‌రావ‌తి : ఏపీలోని భోగాపురం ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా స్పందించారు కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
ఏపీ విమానయాన రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం నమోదైందని స్ప‌ష్టం చేశారు. ఈ విజయానికి అందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. భోగాపురం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశా భావం వ్య‌క్తం చేశారు కేంద్ర మంత్రి. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన‌ కృషి వెలకట్టలేనిద‌ని పేర్కొన్నారు. ఆయ‌న చేసిన ఈ ప్ర‌య‌త్నం ఇవాళ నూత‌న ఆవిష్క‌ర‌ణ‌కు మార్గం ఏర్ప‌డింద‌న్నారు.

ముందు నుంచి త‌మ నాయ‌కుడికి దూర‌దృష్టితో ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ప్రాజెక్టు పురోగతికి కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం అందించిన స‌హాయ స‌హ‌కారాలు మ‌రిచి పోలేమ‌ని స్పష్టం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి వేగం పెరిగిందని తెలిపారు . ఉత్తరాంధ్రను ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు కృషి కొనసాగుతుందని, ఆ న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రజల ఆశయాలకు న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు. ఈ సంద‌ర్బంగా ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచంతో భోగాపురం అనుసంధానం అయ్యేందుకు మార్గం ఏర్ప‌డింద‌న్నారు.

Exit mobile version