హైదరాబాద్ : భారతీయ సినీ చరిత్రలో ఎవరూ ఊహించని రీతిలో ఆదరణ పొందుతోంది ఆదిత్య ధర్ తాజాగా తీసిన ధురంధర్ మూవీ. కేవలం 10 రోజుల్లోనే రూ. 500 కోట్లు వసూలు చేసి నివ్వెర పోయేలా చేసింది. ఆపై రూ. 1000 కోట్లకు దగ్గరలో ఉంది. ఈ మూవీ సృష్టిస్తున్న సంచనాలను చూసి సినీ విమర్శకులు, దర్శకులు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. గురువారం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ధురంధర్ మూవీ గురించి అద్భుతంగా విశ్లేషించాడు. ఆదిత్య ధర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. విచిత్రం ఏమిటంటే తను ఎవరినీ సామాన్యంగా ప్రశంసించడు. అందుకు ఒప్పుకోడు కూడా. ఈ తరుణంలో ఉన్నట్టుండి మరోసారి బాంబు పేల్చాడు ఆర్జీవీ.
ఈ సందర్బంగా ధురంధర్ చిత్రం దెబ్బకు సినిమా పరిశ్రమ భయపడుతోందని పేర్కొన్నారు. అందుకే దానిని విస్మరిస్తోందని అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఖరీదైన సెట్లు, ఐటమ్ సాంగ్స్, హీరో ఆరాధన కథల టెంప్లేట్‌కు కట్టుబడి ఉండే చిత్ర నిర్మాతలు సైతం భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అంతే కాదు తాము సృష్టించిన మసాలా చిత్రాల చెరసాలలో తప్పకుండా శిలువ వేయబడతారంటూ పేర్కొనడం విస్తు పోయేలా చేసింది. ఎప్పుడైతే ధురంధర్ లాంటి ఒక విప్లవాత్మకమైన లేదా భారీ హిట్ సినిమా వస్తుందో, పరిశ్రమలోని వారు దానిని విస్మరించాలని కోరుకుంటారని అన్నారు ఆర్జీవీ.


















