రైతుల‌ను ప‌ట్టించుకోని కాంగ్రెస్ స‌ర్కార్

నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

hellotelugu-MLCKavitha

న‌ల్ల‌గొండ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. రాష్ట్ర కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించారు. సూర్యాపేట మార్కెట్ ను సందర్శించారు. రైతులు, చిరు వ్యాపారులతో మాట్లాడారు క‌విత‌. ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడారు. సూర్యాపేట లో పెద్ద ఎత్తున కట్టిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఎందుకు వాడకంలో లేదని ప్ర‌శ్నించారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ కట్టారని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌డంలో విఫ‌లం అయ్యారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ ఏ మాత్రం నాణ్యత లేదు. రీ సౌండ్ తో పాటు, గాలి కూడా రావటం లేదని రైతులు బాధ ప‌డుతున్నార‌ని అన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

ఫ్లాట్ ఫామ్ ఎత్తు కూడా చాలా పైకి కట్టడం వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేద‌న్నారు. బయట మెట్ల నుంచి ఫ్లాట్ ఫామ్ వరకు కూరగాయలు తీసుకెళ్లటం ఇబ్బందిగా మారిందని ఆవేద‌న చెందారు. మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్లలో మహిళలు, పెద్ద వయసు వాళ్లే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. మెట్ల నుంచి ఫ్లాట్ ఫామ్ వరకు కూరగాయలు తీసుకెళ్లటం వారికి ఇబ్బందిగా మారిందన్నారు. దీంతో వాళ్లంతా కూడా బయటనే కూరగాయలు అమ్ముతున్న పరిస్థితి నెల‌కొంద‌ని వాపోయారు. ఇంత లోప భూయిష్టంగా ఉన్న మార్కెట్ కోసం ఖర్చు చేసింది రూ. 50 కోట్లు అని, 36 కోట్లు అని చెబుతున్నార‌ని ఆరోపించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం నుంచి ఉన్నారు. అధికార పక్షం వేరే పార్టీ దీంతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు క‌విత‌.

Exit mobile version