అహ్మదాబాద్ : ఐసీసీ చైర్మన్ జే షా సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు అద్భుతం చేసిందని, విశ్వ విజేతగా నిలవడం ఆనందంగా ఉందన్నాడు. కుర్రాళ్లు చరిత్రను తిరగ రాశారంటూ కితాబు ఇచ్చాడు. కప్ గెలుచుకున్న అనంతరం జే షా మీడియాతో మాట్లాడాడు. వరుసగా టైటిళ్లను గెలుచు కోవడం ద్వారా చరిత్ర సృష్టించినందుకు జట్టును అభినందనలతో ముంచెత్తారు. ఈ టోర్నమెంట్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన అత్యంత ప్రపంచ ఈవెంట్‌లలో ఒకటిగా ప్రశంసించారు . అత్యంత ప్రపంచవ్యాప్త, ప్రాప్యత చేయగల ఐసీసీ ఈవెంట్‌కు ఎంత అద్భుతమైన ముగింపు అని పేర్కొన్నారు జే షా.
వరుసగా మూడు ఐసీసీ టి20 వరల్డ్ కప్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచిన భారతదేశానికి అభినందనలు తెలిపారు. సూర్యకుమార్ యాదవ్ , మొత్తం జట్టు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.. BCCI కార్యదర్శి సైకియా కూడా జట్టు చారిత్రాత్మక విజయాన్ని ప్రశంసించారు . ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ , టీం ఇండియాలోని ప్రతి సభ్యునికి పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా టాస్ ఓడి ముందుగా మైదానంలోకి దిగింది భారత్. సంజు సామ్సన్ (46 బంతుల్లో 89, ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో, అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52, ఆరు ఫోర్లు , మూడు సిక్సర్లతో), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54, నాలుగు బౌండరీలు , నాలుగు సిక్సర్లతో) , శివం దుబే 8 బంతుల్లో 26 రన్స్ చేశాడు. ఇండియా 5 వికెట్లు కోల్పోయి 255 రన్స్ చేసింది. కీవీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

















