ఇథియోపియా : భారత దేశ ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా ఇథియోపియాలో పర్యటించారు. ఆ దేశ ప్రధానితో కలిసి మ్యూజియంను సందర్శించారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా చర్యలు తీసుకుంటామన్నారు మోదీ. ఈ పర్యటనలో ఇరు దేశాలు తమ చారిత్రక సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాయని స్పష్టం చేశారు. ఇథియోపియా దేశ రాజధాని అడిస్ అబాబాలోని అడిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ, ప్రధాని నరేంద్ర మోడీ. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. కీలకమైన అంశాలపై చర్చించారు దేశాధినేతలు. ప్రధానంగా ప్రపంచాన్ని కలవర పెడుతున్న ఉగ్రవాదం, హింసపై ఎక్కువగా ప్రస్తావించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభివృద్ధి, ప్రజల కేంద్రీకృత అభివృద్ధిపై దృష్టి సారించిన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో బహుళ ఒప్పందాల సంతకాన్ని ఒక కీలకమైన అడుగుగా అభివర్ణించారు. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీతో కూడా ఆయన విస్తృత చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇరు దేశాధినేతలు వివిధ రంగాలలో మూడు అవగాహన ఒప్పందాల మార్పిడికి ఓకే చెప్పారు. ఈ అవగాహన ఒప్పందాలు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాల శిక్షణ, కస్టమ్స్ విషయాలలో పరస్పర పరిపాలనా సహాయం, ఇథియోపియా విదేశాంగ మంత్రిత్వ శాఖలో డేటా సెంటర్ ఏర్పాటు రంగాలలో కుదిరాయి. ఇరుపక్షాలు సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచడం, G20 కింద రుణ పునర్నిర్మాణం, ఇథియోపియన్ల కోసం మరిన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ స్కాలర్‌షిప్‌లు , ఏఐ షార్ట్ కోర్సులు కూడా ఉన్నాయి.
