కేర‌ళ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మిష‌న్ స్టార్ట్

తిరువ‌నంత‌పురం మేయ‌ర్ గెలుపుతో జోష్

hellotelugu-AmitShah

కేర‌ళ : క‌మ్యూనిస్టుల కంచుకోట‌గా భావిస్తూ వ‌చ్చిన కేర‌ళలో ఉన్న‌ట్టుండి బిగ్ షాక్ త‌గిలింది సీపీఎం, కాంగ్రెస్ పార్టీల‌కు. తాజాగా తిరువ‌నంత‌పురం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ జెండా ఎగుర‌వేసింది. ఏకంగా కార్పొరేట‌ర్ల‌తో పాటు మేయ‌ర్ ప‌ద‌విని కైవ‌సం చేసుకుంది. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు బీజేపీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా రంగంలోకి దిగ‌నున్నారు. త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్ట‌నున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టి నుంచే బీజేపీ ఘ‌న విజ‌యం సాధించేలా ప్లాన్ కు శ్రీ‌కారం చుట్టారు. ఇందు కోసం కేర‌ళ బీజేపీ మిష‌న్ ను ప్రారంభించ‌నున్నారు అమిత్ షా.

ఇదిలా ఉంగా ఈ ఏడాది చివ‌ర‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తాను కేర‌ళ‌ల‌లో ప‌ర్య‌టించారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల నుండి కొత్తగా ఎన్నికైన ప్రతినిధులతో సమావేశం అయ్యారు కేంద్ర మంత్రి. కేరళలో అభివృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌ద‌స్సులో పాల్గొని ప్ర‌సంగించారు. అంత‌కు ముందు ఆయ‌న కేర‌ళ‌కు చేరుకున్నారు. అత్యంత ప్ర‌సిద్ది పొందిన శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో దర్శనం చేసుకుని, పూజలు నిర్వహించడం ద్వారా తన దినచర్యను ప్రారంభించారు.

Exit mobile version