తాడేపల్లి గూడెం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంలో చోటు చేసుకున్న వివాదం , సర్ ప్రక్రియపై కొనసాగుతున్న ప్రతిష్టంభన, ఆరోపణల నేపథ్యంలో తాజాగా జగన్ చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓ వైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు స్వచ్చంధంగా . తక్షణమే సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమండ్ చేశారు. ఇక జగన్ రెడ్డి విషయానికి వస్తే ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పనిచేస్తుందని అన్నారు. ఈసీఐ ,ఎస్ఐఆర్ విషయంలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియను పునఃసమీక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఓటర్ల జాబితాలు, డేటాబేస్ యాక్సెస్‌కు సంబంధించిన నిర్ణయాలు, విధానాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 10 నెలల వ్యవధిలో కనీసం 14 సార్లు అభ్యంతరాలు లేవనెత్తారని ఒక నివేదిక పేర్కొన్న తర్వాత ప్రతిపక్షాల విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడేందుకు ఆస్కారం ఉంటుంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు, ఈసీఐ నిర్వహణపై పలు సందర్భాల్లో అభ్యంతరాలు లేవనెత్తారని మీడియా నివేదికలు చెబుతున్నాయి, ఇది ప్రజలలో తీవ్రమైన ప్రశ్నలు , సందేహాలకు దారితీసింది అని రెడ్డి అన్నారు. ఆరోపణల మార్పిడి కంటే ప్రజలకు స్పష్టత అవసరమని ఆయన అన్నారు.
ఏ అభ్యంతరాలు నమోదయ్యాయి, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం లేదా పునరుద్ధరించడం వంటి విషయాలలో వ్యవస్థ ఎంత పారదర్శకంగా పనిచేసిందనే దానిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు జగన్ రెడ్డి. ఈ విషయాలపై ప్రజలకు విశ్వాసం కల్పించడానికి చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని, ప్రతి పౌరుడికి నిర్భయంగా ఓటు వేసే హక్కును బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
