న్యూఢిల్లీ : జాతిని ఉద్దేశించి ప్రతి నెల నెలా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన సాగించిన ఈ ప్రయాణం ఇప్పటికీ 12 ఏళ్లు పూర్తి చేసుకుంది . ఈ సందర్భంగా ఆదివారం పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఓ పుణ్య యాత్రగా పేర్కొన్నారు. తన రేడియో ప్రసంగం ద్వారా తాను ఒక విధంగా దేశ సమిష్టి శక్తిని (లోక్శక్తిని) ఆరాధిస్తున్నానని కూడా మోదీ అన్నారు. పౌరుల కృషిని దగ్గరగా అర్థం చేసుకోవడానికి, వారి సేవలకు నివాళులర్పించడానికి ఇది ఒక అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం 139వ సంచికలో తన రేడియో ప్రసంగం ద్వారా దేశంలోని ప్రతి కుటుంబంతో మమేకమయ్యే అవకాశం ఇది తనకు కల్పిస్తోందని కూడా మోదీ అన్నారు. మన్ కీ బాత్కు మరోసారి స్వాగతం పన్నెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున, విజయదశమి పవిత్రమైన సందర్భంగా మనం మన్ కీ బాత్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు పీఎం.
అప్పటి నుండి మన ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు . ఈ ప్రయాణంలో మీరు సహ ప్రయాణికులు,మార్గదర్శకులు అని ఆయన అన్నారు. దేశంలోని సామాన్య ప్రజల కృషి, శౌర్యం, నిబద్ధత, అంకితభావం , సేవా స్ఫూర్తిని కీర్తించడానికి మన్ కీ బాత్ తనకు ఒక పవిత్రమైన సందర్భం అని ప్రధానమంత్రి అన్నారు. మన దేశంలో తీర్థయాత్రల ప్రాచీన సంప్రదాయం ఉంది. దేశ ప్రజల కృషి గురించి దగ్గరగా తెలుసు కోవడానికి , వారి సేవలకు నమస్కరించడానికి నాకు మన్ కీ బాత్ ఒక తీర్థయాత్ర కంటే తక్కువ కాదు అని ఆయన అన్నారు నరేంద్ర మోదీ. సమాజం, దేశం కోసం జీవించేవారు ఒక పుణ్యక్షేత్రం వంటివారని మోదీ అన్నారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని నలుమూలల నుంచి ఎంతోమంది ముందుకు వచ్చారని, వారి అసాధారణమైన కృషి సాధారణంగా సమాజ దృష్టిని ఆకర్షిస్తుందని ఆయన అన్నారు. అనేక స్ఫూర్తి దాయకమైన కథలను మీ అందరి ముందుకు తీసుకు రావడానికి ‘మన్ కీ బాత్’ కృషి చేసిందని చెప్పారు.

















