ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినీ రంగానికి చెందిన నటీ నటులు, దర్శకులు, నిర్మాతలతో పాటు ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులు సైతం ప్రతి నిత్యం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. కొందరు వీఐపీ ద్వారా, మరికొందరు బ్రేక్ దర్శనం ద్వారా, ఇంకొందరు రూ. 300 టికెట్ల ద్వారా, ఉచిత దర్శనాల ద్వారా స్వామిని దర్శించుకుంటారు. అయితే నటి జాన్వీ కపూర్ ఇందుకు భిన్నం. తను ఏ సినిమా చేసినా ముందు తిరుమలకు వస్తారు. వచ్చిన వెంటనే తనకు సాదర స్వాగతం పలికినా పట్టించుకోరు.
అత్యంత భక్తి శ్రద్దలతో శ్రీ వేంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ మెట్ల మార్గం ద్వారా కాలి నడకన తిరుమలకు చేరుకుంటారు. గత కొంత కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఎందుకు నడిచి వెళతారంటూ ఈ మధ్యే జరిగిన చిట్ చాట్ సందర్బంగా యాంకర్ ప్రశ్నించారు. దానికి ఆసక్తికరమైన సమాధానం చెప్పింది జాన్వీ కపూర్. VIP సౌకర్యాలు ఉన్నప్పటికీ, సామాన్య భక్తురాలిలా కాలినడకన మెట్లెక్కి స్వామివారిని దర్శించుకోవడం నటి జాన్వీ కపూర్‌కు అలవాటు ఎందుకన్న ప్రశ్నకు కూల్ గా సమాధానం ఇచ్చింది. కాలినడకన ప్రయాణించడం వల్ల కలియుగ దైవం బాలాజీకి మరింత దగ్గరైనట్లు అనిపిస్తుందని చెప్పింది. ఆ ఆధ్యాత్మిక అనుభవం తనకు ఎంతో ఇష్టమని ఆమె తాజాగా వెల్లడించారు.
