Tharun Bhascker : హైదరాబాద్ : పూర్తి కామెడీ, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా రూపొందించిన బాబా బ్లాక్ షీప్ మోషన్ పిక్చర్ కు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. దీనిని ఇవాళ విడుదల చేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). ఇది పూర్తిగా నేరం, వినోదం, తుపాకులు, బంగారం, వేట సాగించడం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారు. ఒకే రోజులో జరిగే సంఘటనలను తెరపై చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని పేర్కొంటున్నారు సినీ వర్గాలు.
Tharun Bhascker Movie Updates
కాగా బాబా బ్లాక్ షీప్ మోషన్ పిక్చర్ ను చిత్రాలయం స్టూడియోస్ ఆధ్వర్యంలో వేణు దోనేపూడి నిర్మించారు. దోనేపూడి చక్రపాణి సమర్పించారు. దీనికి గుణి మంచి కాంతి దర్శకత్వం వహించారు. సినిమాలో ఉపేంద్ర, జార్జ్ మారియన్ , టిను ఆనంద్, అక్షయ్ లగుపాని, విష్ణు, కార్తికేయ, విశ్వశ్రీ, మాళవి, తదితరులు కీలక పాత్రలు పోషించారు. దసరా పండుగను పురస్కరించుకుని మూవీ మేకర్స్ సినిమా గురించిన పరిచయం చేశారు. ఆయా పరిస్థితులు, సంఘటనల నుండి ఉత్పన్నం అయ్యే హాస్యం, ఈ జర్నీలో జరిగే నేరాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, అనుభవాన్ని మిగిలేలా చేస్తుందని పేర్కొన్నారు మూవీ మేకర్స్.
Also Read : Roshni Nadar Growth in Top 3 : దేశంలో అత్యంత ధనవంతురాలిగా రోష్నీ నాడర్


















