Azharuddin Growth As a Minister : ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ : అజ‌హ‌రుద్దీన్

మంత్రిగా కొలువు తీరిన భార‌త జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్

Hello Telugu - Azharuddin Growth As a Minister

Hello Telugu - Azharuddin Growth As a Minister

Azharuddin : హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ (Azharuddin) చిర‌కాల కోరిక నెర‌వేరింది. ఆయ‌న క్రికెట‌ర్ గా, కెప్టెన్ గా పేరు పొందారు. భార‌త జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాల‌ను చేకూర్చి పెట్ట‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బీసీసీఐ త‌న‌పై వేటు వేసింది. ఆ త‌ర్వాత కోర్టుకు వెళ్లాడు. తాను నిర్దోషిన‌ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ త‌ర్వాత బీసీసీఐ త‌న‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ పార్టీ టికెట్ ఇస్తే యూపీలో ఎంపీగా గెలుపొందాడు. మ‌రోసారి టికెట్ ఇవ్వ‌గా ఓట‌మి పాల‌య్యాడు. త‌న స్వ‌స్థ‌లం హైద‌రాబాద్. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత త‌ను ఇక్క‌డ సెటిల్ అయ్యాడు. నా రాష్ట్రం తెలంగాణ అని ప్ర‌క‌టించాడు.

Azharuddin Comments

ఆ త‌ర్వాత టీపీసీసీ ఉపాధ్య‌క్షుడిగా ఉన్నాడు. ఇక్క‌డ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. మాగంటి గోపీనాథ్ చేతిలో ఓట‌మి పాల‌య్యాడు. మ‌రోసారి టికెట్ ఆశించాడు. కానీ ఎందుక‌నో హైక‌మాండ్ , సీఎం ఒప్పుకోలేదు. చివ‌ర‌కు త‌న‌ను త‌ప్పించారు. ఎమ్మెల్సీ కోటాలో త‌న‌కు ప‌ద‌వి అప్ప‌గిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌న‌ను కేబినెట్ లోకి తీసుకున్నారు. శుక్ర‌వారం రాజ్ భ‌వ‌న్ లో మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశాడు. ఆయ‌న ఆరు నెలల్లో త‌ను ఎమ్మెల్సీ అయినా కావాలి లేదా ఎమ్మెల్యేగా అయినా గెలుపొందాల్సి ఉంటుంది. ఈ సంద‌ర్బంగా ఎక్స్ వేదిక‌గా అజ‌హ‌రుద్దీన్ స్పందించాడు. త‌న‌కు ఛాన్స్ ఇచ్చిన ఏఐసీసీకి, ఖ‌ర్గే, రాహుల్, ప్రియాంక‌, సోనియా, మీనాక్షి న‌ట‌రాజ‌న్, రేవంత్ రెడ్డిల‌కు థ్యాంక్స్ తెలిపాడు.

Also Read : KTR Fired on Congress Govt : తెలంగాణ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించిన కాంగ్రెస్ స‌ర్కార్

Exit mobile version