Thandel Movie Sensational : టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ లో తండేల్ హ‌వా

అక్కినేని నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి న‌ట‌న

hellotelugu-thandelrecord

Thandel : అతి త‌క్కువ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన చిత్రం తండేల్ (Thandel). చందూ మొండేటి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అక్కినేని నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి ప్రాణం పెట్టి న‌టించారు. ప్ర‌త్యేకించి ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది. సినీ రంగ విశ్లేష‌కులు, విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఎవరూ ఊహించ‌ని రీతిలో వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇటు థియేట‌ర్ల‌లో వ‌సూళ్లు సాధించింది. అటు ఓటీటీలో సైతం అత్య‌ధిక వీక్ష‌ణ‌లు పొందింది. తాజాగా టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ లో కూడా దుమ్ము రేపింది తండేల్.

Thandel Movie Sensational

ఇక ఈ సినిమాలో సాయి ప‌ల్లవి చేసిన డ్యాన్స్, న‌ట‌న‌, ప‌లికించిన హావ భావాలు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను తాకింది. గుండెల‌ను పిండేసింది. మ‌న‌సుల‌ను మెలిపెట్టేలా చేసింది. ప్ర‌త్యేకించి స‌ముద్రం వ‌ద్ద చేసిన పాట ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ గా నిలిచింది. చివరిగా లవ్ స్టోరీలో కనిపించిన వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాలో కూడా అంత‌కంటే ఎక్కువ‌గా పనిచేసింది. తండేల్ మొదటి టెలివిజన్ ప్రీమియర్‌లోనే బ్లాక్ బస్టర్ టీఆర్సీని అందుకుంది.

కాగా తండేల్ చిత్రం వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ గ‌త జూన్ 29న జీ తెలుగులో ప్ర‌సార‌మైంది. ఏకంగా ఈ మూవీ 10.32 టీఆర్పీ రేటింగ్ పొందింది. ఇక రేటింగ్ ప‌రంగా చూస్తే తెలుగు సినిమాలలో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంక్రాంతికి వ‌స్తున్నాం నెంబ‌ర్ వ‌న్ గా నిలిస్తే సుకుమార్ తీసిన పుష్ప‌-2 ది రూల్ 3వ స్థానంలో నిలిచింది.

Also Read : Beauty Kiara Advani : ఆ ఇద్ద‌రి హీరోల‌తో న‌టించ‌డం అద్భుతం

Exit mobile version