Beauty Kiara Advani : ఆ ఇద్ద‌రి హీరోల‌తో న‌టించ‌డం అద్భుతం

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన న‌టి కియారా అద్వానీ

Hello Telugu - Beauty Kiara Advani

Hello Telugu - Beauty Kiara Advani

Kiara Advani : బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. జూనియ‌ర్ ఎన్టీఆర్, హృతికి రోష‌న్ తో క‌లిసి తాను న‌టించిన వార్ 2 చిత్రం గురించి స్పందించింది. చిత్రీక‌ర‌ణ జ‌రిగేంత వ‌ర‌కు తాను ఫుల్ ఎంజాయ్ చేశాన‌ని తెలిపింది. ఆ ఇద్ద‌రు హీరోలు వెరీ వెరీ స్పెష‌ల్ అని పేర్కొంది. ఆ జ్ఞాప‌కాలు త‌న‌ను మ‌రిచి పోలేన‌ని పేర్కొంది. ప్ర‌త్యేకించి ఈ మూవీ రిలీజ్ కోసం ఎంత‌గానో ఆతృతంగా ఉన్నాన‌ని చెప్పింది. తాజాగా కియారా అద్వానీ (Kiara Advani) చేసిన కామెంట్స్ మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Kiara Advani Praises

దేవ‌ర మూవీతో హిందీలో త‌న ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు టాలీవుడ్ అగ్ర హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్. త‌న సినీ కెరీర్ లో తొలిసారిగా హిందీలో ఎంట్రీ ఇచ్చారు. ఒక‌రి కంటే మ‌రొక‌రు పోటీప‌డి నటించారు ఇందులో. త‌ను కూడా ఇందులో భాగం పంచుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు న‌టి కియారీ అద్వానీ. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం కోసం ఎంత‌గానో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

ఈ వార్ -2 చిత్రానికి అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తార‌క్, రోష‌న్ లు ముఖ్య‌మైన రోల్స్ పోషించ‌గా వారికి ధీటుగా తాను కూడా పోటీ ప‌డి న‌టించింది బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్య‌నే సినిమా షూటింగ్ పూర్త‌యింద‌ని తెలిపింది. ఆ ఇద్ద‌రితో స్క్రీన్ పంచుకోవ‌డం మాత్రం త‌న‌ను ఎంత‌గానో సంతోషానికి, ఆనందానికి గుర‌య్యేలా చేసింద‌ని పేర్కొంది. తాను ఎంత‌గానో నేర్చుకున్న‌ట్లు చెప్పారు. భారీ అంచ‌నాలు పెంచుతూ వ‌స్తున్న వార్ -2 ఆగ‌స్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Also Read : Minister Kandula Durgesh Proven : విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు

Exit mobile version