Thalapathy Vijay – TVK CM Interesting Update : టీవీకే పార్టీ సీఎం అభ్య‌ర్థిగా ద‌ళ‌పతి విజ‌య్

ఏక‌గ్రీవంగా తీర్మానం చేసిన పార్టీ కార్య‌వ‌ర్గం

Hello Telugu - Thalapathy Vijay - TVK CM Interesting Update

Hello Telugu - Thalapathy Vijay - TVK CM Interesting Update

Thalapathy Vijay : చెన్నై : త‌మిళ సూప‌ర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay) సీఎం అభ్య‌ర్థిగా ఎంపిక‌య్యాడు. ఈ విష‌యాన్ని టీవీకే బుధ‌వారం వెల్ల‌డించింది. చెన్నైలోని ఆ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఏక‌గ్రీవంగా త‌న‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్రతిపాదించారు. దీనికి ఏ ఒక్క‌రూ అభ్యంత‌రం తెల‌ప‌క పోవ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ కూటమిపై నిర్ణయం తీసుకునే అధికారం పొందారు . మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఎప్ప‌టి లాగేనా త‌ను కూడా హాజ‌ర‌య్యారు. అంతే కాకుండా పార్టీల‌తో పొత్తు పెట్టుకునే అంశంపై కూడా ప్ర‌ధానంగా ఈ కీల‌క స‌మావేశంలో చ‌ర్చించారు. ఇందులో భాగంగానే ఎలాంటి నిర్ణ‌య‌మైనా తీసుకునే అధికారాన్ని త‌మ పార్టీ బాస్ ద‌ళ‌ప‌తి విజ‌య్ కు అప్ప‌గించారు.

Thalapathy Vijay As a TVK CM Candidate

ఇదిలా ఉండ‌గా విజ‌య్ తాను కొత్త‌గా పార్టీ ఏర్పాటు చేసిన స‌మ‌యంలో రాబోయే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఏ ఒక్క పార్టీతో క‌లిసి పోటీ చేయ‌బోదంటూ ప్ర‌క‌టించారు. కానీ అనూహ్యంగా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. ఆయ‌న పార్టీ త‌ర‌పున ర్యాలీ, ప్ర‌చారం చేపట్టారు. అయితే ఇదే స‌మ‌యంలో కరూర్ లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయ‌న ఉన్న‌ట్టుండి సైలెంట్ అయి పోయారు. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు డీఎంకే స‌ర్కార్ సిట్ ను ఏర్పాటు చేయ‌గా, హైకోర్టు ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని ఆదేశించింది. మ‌రో వైపు సుప్రీంకోర్టు సీబీఐతో ద‌ర్యాప్తు చేయాల‌ని ఆదేశించింది. ఈ త‌రుణంలో డీఎంకేకు వ్య‌తిరేకంగా ఆయ‌న అన్నాడీఎంకేతో క‌లిసి ముందుకు సాగుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : Nara Bhuvaneshwari Important Update : అవార్డులు బాధ్య‌త‌ను పెంచాయి : నారా భువ‌నేశ్వ‌రి

Exit mobile version