BCCI Committee Important Decision : బీసీసీఐ నూత‌న కార్య‌వ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు

ఉపాధ్య‌క్షుడిగా రాజీవ్ శుక్లా, కార్య‌ద‌ర్శిగా సైకియా

hellotelugu-bcci

BCCI : ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 94వ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం ముంబై బీసీసీఐ ప్ర‌ధాన కార్యాలయంలో జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. బీసీసీఐ (BCCI) నూత‌న అధ్య‌క్షుడిగా మిథున్ మ‌న్హాస్ , ఉపాధ్య‌క్షుడిగా రాజీవ్ శుక్లా, కార్య‌ద‌ర్శిగా దేవ‌జిత్ సుక్రియా, స‌హాయ కార్య‌ద‌ర్శిగా ప్ర‌భ‌తేజ్ భాటియా, కోశాధికారిగా ఎ. ర‌ఘురామ్ భ‌ట్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అపెక్స్ కౌన్సిల్‌లో జనరల్ బాడీకి ప్ర‌తినిధిగా జ‌య‌దేశ్ షా ఎన్నిక‌య్యారు.

BCCI New Decision

వీరితో పాటు ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ గ‌వ‌ర్నరింగ్ కౌన్సిలింగ్ కు ఇద్ద‌రు ప్ర‌తినిధులు ఎన్నిక‌య్యారు. అరుణ్ సింగ్ ధుమాల్ తో పాటు ఎం. ఖైరుల్ జ‌మాల్ మ‌జుందార్ ఉన్నారు. ఈ సంద‌ర్బంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ చేయబడిన ఖాతాలను జనరల్ బాడీ ఆమోదించింది.
అంతే కాకుండా మెన్స్ ఎంపిక క‌మిటీని కూడా ప్ర‌క‌టించారు. చైర్ ప‌ర్స‌న్ గా అజిత్ అగార్క‌ర్, శివ సుంద‌ర్ దాస్ , అజ‌య్ రాత్రా, ఆర్పీసింగ్ , ప్ర‌జ్ఞాన్ ఓజా ఉన్నారు.

మ‌హిళా జ‌ట్టు ఎంపిక క‌మిటీని కూడా ప్ర‌క‌టించారు. అమితా శ‌ర్మ చైర్ ప‌ర్స‌న్ కాఆ శ్యామా డే, సుల‌క్ష‌ణ నాయ‌క్, జ‌య శ‌ర్మ‌, స్ర‌వంతి నాయుడు ఉన్నారు. స్రవంతి నాయుడును మహిళా ఎంపిక కమిటీలో కొత్తగా చేర్చుకున్నారు. వీరితో పాటు జూనియర్ క్రికెట్ కమిటీని ప్రకటించారు. శ‌ర‌త్ చైర్ ప‌ర్స‌న్ కాగా హ‌ర్వింద‌ర్ సోధి, పాథిక్ పాటిల్, కృష్ణ మోహ‌న్ , ర‌ణ దేబ్ బోస్ ను ఎన్నుకున్నారు ఏక‌గ్రీవంగా. అంతే కాకుండా మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ క‌మిటీని కూడా ప్ర‌క‌టించింది బీసీసీఐ (BCCI). శ్రీ జయేష్ జార్జ్ చైర్‌పర్సన్ కాగా మిథున్ మ‌న్హాస్ , రాజీవ్ శుక్లా, దేవజిత్ సైకియా , ప్రభతేజ్ భాటియా; ఎ రఘురామ్ భట్, మధుమతి లేలే, సంజయ్ టాండన్, ఆర్ఐ ప‌ళ‌ని, అరుణ్ సింగ్ ధుమాల్ ను ఎన్నుకున్నారు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యులను ప్ర‌క‌టించింది బీసీసీఐ. రోహ‌న్ జైట్లీ చైర్ ప‌ర్స‌న్ కాగా మిథున్ మన్హాస్,
రాజీవ్ శుక్లా, దేవజిత్ సైకియా; ప్రభతేజ్ భాటియా; ఎ రఘురామ్ భట్, అనిరుధ్ చౌదరి, సనా సతీష్ బాబు ఉన్నారు.

Also Read : Bathukamma Clelebrations Interesting : ఆస్ట్రేలియాలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ సంబురాలు

Exit mobile version