TG Vishwa Prasad Shocking Decision : ఓజీ కోసం టీజీ సంచ‌ల‌న నిర్ణ‌యం

మిరాయ్ థియేట‌ర్లు ఓజీ కోసం అప్ప‌గింత‌

Hello Telugu - TG Vishwa Prasad

Hello Telugu - TG Vishwa Prasad

TG Vishwa Prasad : ప్ర‌ముఖ నిర్మాత‌, వ్యాపార‌వేత్త టీజీ విశ్వ ప్ర‌సాద్ (TG Vishwa Prasad), కృతి ప్ర‌సాద్ లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వారికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద ఉన్న ప్రేమ‌తో అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు తాము తీసిన మిరాయ్ సినిమా ప్ర‌ద‌ర్శించ బ‌డుతున్న అన్ని థియేట‌ర్ల‌ను ప‌వ‌ర్ స్టార్ న‌టించిన ఓజీ కోసం ఇచ్చేశారు. ఇది ఎవ‌రూ ఊహించ‌ని నిర్ణ‌యం. ఒక ర‌కంగా చెప్పాలంటే బిగ్ లాస్. అయినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద అభిమానం ఉండ‌డంతో ఈ ర‌కంగా రుణం తీర్చుకుంటున్న‌ట్లు తెలిపారు నిర్మాత‌ల‌తో పాటు న‌టుడు తేజ స‌జ్జా. త‌న‌కు ప‌వ‌న్ అంటే పంచ ప్రాణం. ఏ ఒక్క‌టి త‌మ సినిమా కోసం కాకుండా అన్ని స్క్రీన్ల‌ను మిరాయ్ కి అప్ప‌గించ‌డం తో సినీ వ‌ర్గాలు విస్మ‌యానికి గుర‌య్యాయి. ఇలాంటి నిర్ణ‌యం ఇప్ప‌టి వ‌ర‌కు ఏ నిర్మాత తీసుకోలేదు.

TG Vishwa Prasad Shocking Decision

తేజ సజ్జా ఈ సంద‌ర్బంగా స్పందించాడు. సినీ పరిశ్రమలో మరింత సహకారం కోసం ప్రయత్నం చేయ‌డంలో భాగంగానే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నాడు. అయితే కేవ‌లం ఒక్క రోజుకు మాత్ర‌మే థియేట‌ర్ల‌ను అప్ప‌గించామ‌ని, తిరిగి య‌థావిధిగా ఇప్ప‌టికే న‌డుస్తున్న స్క్రీన్ల‌లో ప్ర‌ద‌ర్శితం అవుతుంద‌ని పేర్కొన్నారు. సో గురువారం నుంచి థియేట‌ర్ల‌లో త‌మ అభిమానుల కోసం మిరాయ్ ని ప్ర‌ద‌ర్శిస్తారు . సినిమా పరిశ్రమలో మరింత సహకారం, సంఘీభావం ఉండాలని తేజ భావిస్తున్నాడు. మనం ఎదగడానికి ఇదే ఏకైక మార్గం అన్నారు. అంతే కాదు వారు అడగాల్సిన అవసరం కూడా లేదన్నాడు.

Also Read : Hero Pawan Kalyan OG OTT : భారీ ధ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ మూవీ

Exit mobile version