TG High Court : హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై సీరియస్ అయ్యింది. ఏం తమాషాగా ఉందా అంటూ నిలదీసింది. కోర్టు (TG High Court) అంటే, చట్టాలు అంటే లేక్క లేకుండా పోయిందని మండిపడింది. ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందేనని పేర్కొంది. అది సీఎం రేవంత్ రెడ్డి అయినా లేక కమిషనర్ నువ్వైనా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవి ఉంది కదా అని అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఇప్పటికే ఆయా కేసులకు సంబంధించి హైకోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించినా ఎందుకు పట్టించు కోలేదంటూ ఫైర్ అయ్యింది. ఇక నుంచి ఉపేక్షించే ప్రసక్తి లేదని పేర్కొంది.
TG High Court Shocking Hydraa Commissoner Ranganath
ఇందుకు సంబంధించి ఏవీ రంగనాథ్ కు చీవాట్లు పెట్టింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5 లోపు ప్రత్యక్షంగా కోర్టు ముందుకు రావాలని, లేక పోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామన్న హైకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కులను హైడ్రా ఉల్లంఘించిందంటూ మండిపడింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకు వేశారు అంటూ నిలదీసింది ఏవీ రంగనాథ్ ను ఉద్దేశించి. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదంటూ నిప్పులు చెరిగింది. FTL నిర్ధారించకుండా ఎలా కూల్చేస్తారంటూ హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయ్యింది.
Also Read : Miamin Corporation Huge Investment : హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
