TG High Court Approved : భమృక్నుద్దౌలా చెరువుకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్

ప్రారంభించేందుకు హైడ్రాకు అనుమ‌తి

Hello Telugu - TG High Court Approved

Hello Telugu - TG High Court Approved

TG High Court : హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. హైడ్రాకు బిగ్ రిలీఫ్ ఇచ్చేసింది. ఇందులో భాగంగా పాతబస్తీలోని భమృక్నుద్దౌలా చెరువు ప్రారంభోత్సవానికి, అక్కడ జరుగుతున్న చెరువు పునరుద్ధరణ పనులకు హై కోర్టు (TG High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెరువు FTL పరిధిలో తమ స్థలాలు ఉన్నాయని, చెరువు అభివృద్ధి పనులు ఆపాలని అక్కడి వారు కోర్టును ఆశ్రయించారు. విచార‌ణ చేప‌ట్టిన హై కోర్టు ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూనే చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. చెరువు పునరుద్ధరణ, బ్యూటిఫికేషన్ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని ఈ దశలో ఆ పనులు ఆపలేమని హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పు చెప్పారు.

TG High Court Approved

చెరువు FTL పరిధిలో ఇంటి స్థలాలు ఉంటే TDR ద్వారా నష్ట పరిహారానికి ప్రయత్నించాలని జస్టిస్ విజయసేన్ రెడ్డి సూచించారు. హైడ్రా తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ ఈ కేసును వాదించారు. ఈ చెరువుకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ చెరువు పనులు 90 శాతం పూర్త‌య్యాయ‌ని, చెరువులో నీరు వున్న ఫోటోలను కోర్టుకు సమర్పించారు. పాతబస్తీలో చెరువు ఆవశ్యకతను ఇమ్రాన్ ఖాన్ వివరి చారు. వీటన్నిటినీ పరిశీలించిన జ‌డ్జి చెరువుల పునరుద్ధరణను ఆహ్వానించదగ్గది అని వ్యాఖ్యానించారు. నగరంలో ఎన్ని చెరువులు అభివృద్ధి చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువుల అభివృద్ధిలో హైడ్రా చర్యలను అభినందించారు.

Also Read : Konda Murali Shocking Comments : సుమంత్ విషయం నాకు తెలియదు

Exit mobile version