Konda Murali Shocking Comments : సుమంత్ విషయం నాకు తెలియదు

కొండా సురేఖ భ‌ర్త కొండా ముర‌ళి కామెంట్

Hello Telugu - Konda Murali Shocking Comments

Hello Telugu - Konda Murali Shocking Comments

Konda Murali : హ‌న్మ‌కొండ‌ : కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయాలు మ‌రింత కాకా రేపుతున్నాయి. మంత్రుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు తారాస్థాయికి చేరింది. తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా ప‌టేల్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రులు, సీఎం క‌లిసి త‌న పేరెంట్స్ కొండా సురేఖ‌, కొండా ముర‌ళిని (Konda Murali) ల‌క్ష్యంగా చేసుకున్నారంటూ ఆరోపించారు. అంతే కాకుండా సీఎం సోద‌రుల‌కు ఎందుకు సెక్యూరిటీ క‌ల్పిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌లనంగా మారాయి. ఈ సంద‌ర్బంగా కొండా సుష్మిత గురువారం సంచ‌ల‌న వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

Konda Murali Comments

ఈ మొత్తం వ్య‌వ‌హారం హైక‌మాండ్ వ‌ద్ద‌కు చేరింది. దీంతో త‌న కూతురు చేసిన వ్యాఖ్య‌ల‌కు విరుద్దంగా తండ్రి కొండా ముర‌ళి కామెంట్స్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. ఆయ‌న హ‌న్మ‌కొండ‌ లో మీడియాతో మాట్లాడారు. త‌న భార్య‌, మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ విషయం తనకు తెలియదని స్ప‌ష్టం చేశారు. నిన్న హైదరాబాద్ లో మంత్రి ఇంటి వద్ద హైడ్రామా పై తీవ్రంగా స్పందించారు. తన కూతురు పార్టీలోగానీ, పదవిలోగానీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ ఇస్తానన్నారని వెల్లడించారు. పొంగులేటి వివాదంపై స్పందిస్తూ ‘సీఎం, పొంగులేటి మా ఇంటికీ వచ్చారు. వారు నన్నెందుకు టార్గెట్ చేస్తారంటూ పేర్కొన్నారు కొండా ముర‌ళి.

Also Read : Budda Venkanna Shocking Comments : జోగి ర‌మేష్ పోలీసుల‌కు లొంగిపో : వెంక‌న్న‌

Exit mobile version