TG High Court : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు హైకోర్టు (TG High Court). ఇప్పటికే బీసీల రిజర్వేషన్లకు సంబంధించి తీర్పు వెలువరించింది. నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిని సాకుగా చూపిస్తూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తాము ఎన్నికలను నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంతే కాదు అధికారికంగా వెల్లడించింది కూడా. ఈ తరుణంలో పుండు మీద కారం చల్లినట్లు బీసీ సమాజం యావత్తు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పై కారాలు మిరియాలు నూరుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతోంది.
TG High Court Orders
ఇదే సమయంలో శనివారం కీలక అప్ డేట్ ఇచ్చింది హైకోర్టు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసింది. స్థానిక ఎన్నికలు నిర్వహించు కోవచ్చంటూ స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై స్టే ఇటీవల విధించింది హైకోర్టు . ఈ విషయంపై హైకోర్ట్ సమగ్ర తీర్పు కాపీని శుక్రవారం అర్థరాత్రి విడుదల చేసింది. సుప్రీం కోర్టులో ఉన్న నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహించు కోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. పెంచిన 17% రిజర్వేషన్లను ఓపెన్ కేటగిరీగా ప్రకటిస్తూ రీ నోటిఫై చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది ధర్మాసనం.
ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని, ఎన్నికలు నిలిపి వేయాలని తమ ఉద్దేశం కాదని, జీవో మార్పును మాత్రమే ప్రతిపాదిస్తున్నామని తీర్పులో పేర్కొంది.
Also Read : Minister Atchannaidu Interesting Comments on CM : అరుదైన నాయకుడు చంద్రబాబు నాయుడు
