Minister TG Bharat – AP Growth : ఏపీ కూట‌మి పాల‌న సంక్షేమానికి ఆలంబ‌న

రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్

Hello Telugu - Minister TG Bharat - AP Growth

Hello Telugu - Minister TG Bharat - AP Growth

TG Bharat  : అమ‌రావ‌తి – ఏపీలో కూట‌మి పాల‌న అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమం కోసం కృషి చేస్తోంద‌ని చెప్పారు ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ (TG Bharat). ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గ దర్శకత్వంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని అన్నారు.
పెనుగంచిప్రోలు మండలం, తోటచర్ల గ్రామంలో మండల, గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరి పాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ‌రాం రాజ గోపాల్ తో క‌లిసి మంత్రి.

Minister TG Bharat Comments

ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల ఆశయాల మేరకు ఏర్పాటైన‌ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక‌ ఇప్పటి వరకు గడిచిన ఈ కొద్ది కాలంలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింద‌ని చెప్పారు టీజీ భ‌రత్. రైతులకు ఉచిత విద్యుత్, పెన్షన్ల పెంపు, మహిళల డ్వాక్రా రుణ మాఫీ, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుందన్నారు. ఈ విషయాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియ జేయడమే ఈ కార్యక్ర‌మం ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు.

శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య‌ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే సుపరిపాలన సాధ్యమవుతుంద‌న్నారు. అందుకే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకొని మరింత ప్రజా అనుకూల పాలనకు అంకితమవుతామ‌ని చెప్పారు. తోటచర్ల గ్రామ ప్రజలు చూపిన ఆదరణకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : Minister Veeranjaneya Swamy Interesting : విద్యార్థుల క్రీడాభివృద్ది కోసం ప్ర‌త్యేక పాల‌సీ

Exit mobile version