Popular Host Kapil Sharma : క‌పిల్ శ‌ర్మ కేఫ్ పై ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాదుల దాడి

తామే దాడికి పాల్ప‌డ్డామ‌ని ప్ర‌క‌టించిన సంస్థ

Hello Telugu - Popular Host Kapil Sharma

Hello Telugu - Popular Host Kapil Sharma

Kapil Sharma : కెన‌డా – ప్ర‌ముఖ ఇండియ‌న్ క‌మెడియ‌న్ క‌పిల్ శ‌ర్మ ఇటీవ‌లే కెన‌డాలో ప్రారంభించిన క‌పిల్ కేఫ్ పై ఖ‌లిస్తానీ సంస్థ‌కు చెందిన ఉగ్ర‌వాదులు దాడికి పాల్ప‌డ్డారు. కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. కాగా విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని తెలిసింది. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సంఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Kapil Sharma Attack

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌పిల్ శ‌ర్మ‌ (Kapil Sharma), త‌న భార్య యాజ‌మాన్యంలో కొత్త‌గా రెస్టారెంట్ ను ప్రారంభించారు. కపిల్స్ కేఫ్ అనేది దీనికి పేరు పెట్టారు. రెస్టారెంట్ ల‌క్ష్యంగా కాల్పులు చోటు చేసుకున్నాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఇది స్థానిక స‌మాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) కార్యకర్త , భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రాడార్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన హర్జిత్ సింగ్ అలియాస్ లడ్డి ఈ కాల్పులకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. లడ్డి ప్రకటన ప్రకారం కపిల్ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలిపాడు.

కాగా సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. క‌మెడియ‌న్ క‌పిల్ శ‌ర్మ కానీ, త‌న కుటుంబీకులు కానీ ఎవ‌రూ స్పందించ లేదు ఘ‌ట‌న‌పై . కాల్పులు వ్యక్తిగత బెదిరింపు కోసం ఉద్దేశించ బడిందా లేదా విదేశాలలో చురుకుగా ఉన్న ఖలిస్తాన్ అనుకూల తీవ్రవాదుల బెదిరింపులకు సంబంధించినదా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Also Read : AP Liquor Scam – Ex IPS : రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ర‌జ‌త్ భార్గ‌వ‌కు నోటీసులు

Exit mobile version