తెలంగాణ పోలీస్ శాఖ సంచ‌ల‌న‌ నిర్ణయం

బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాలు తొల‌గింపు

hellotelugu-CVAnand

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు రాష్ట్ర పోలీస్ శాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఇవాళ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇందులో భాగంగా ప‌ద‌వుల‌ల‌లో ఉన్న రిటైర్మెంట్ డీజీపీల‌కు ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాల‌ను తొల‌గిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో చాలా మంది ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. వారంతా ఉన్న‌త స్థానాల‌లో కొన‌సాగుతున్నారు.

26 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుత అధికారులకు బుల్లెట్ వాహనాలు తీసివేసిన‌ట్లు ప్ర‌క‌టించారు డీజీపీ సీవీ ఆనంద్. అంతే కాకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లకు సైతం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తీసి వేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదేక్ర‌మంలో మాజీ డిజిపి లకు ఉన్న ఎస్కార్ట్ వాహనాలను సైతం తీసివేసింది పోలీస్ శాఖ.. మ‌రో వైపు పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీసు అధికారులకు ఉన్న గన్ మెన్ ల సంఖ్య తగ్గించింది. చాలావరకు వన్ ప్లస్ వన్ గన్ మెన్ లకే పరిమితం చేసింది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంది. పొదుపు పాటించాల‌ని ఇప్ప‌టికే భార‌త దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ బంగారాన్ని కొనుగోలు చేయొద్ద‌ని, ఇంధ‌నాన్ని పొదుపుగా వాడుకోవాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ ఆసియాలో యుద్ద వాతావ‌ర‌ణం కొన‌సాగుతూనే ఉంది. దీంతో ఆయిల్, గ్యాస్ ధ‌ర‌లు మండుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ పోలీసు శాఖ ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

Exit mobile version