Surendra Mohan : హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐపీఎస్ లు, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న సురేంద్ర మోహన్ (Surendra Mohan) కు కీలక పదవి అప్పగించింది. ఈ మేరకు ఆయనను వ్యవసాయ శాఖ కార్యదర్శిగా నియమించింది. రాష్ట్ర హైకోర్టు సీరియస్ కావడంతో ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ఉన్న సందీప్ కుమార్ ఝాపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో ఎం. హరితను నియమించింది. ఇప్పటి దాకా వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ఉన్న రఘునందన్ రావు పై వేటు వేసింది. ఆయనను వాణిజ్య పన్నుల శాఖకు బదిలీ అయ్యారు; ప్రధాన IAS పునర్వ్యవస్థీకరణలో భాగంగా సందీప్ కుమార్ ఝా TR&B విభాగానికి బదిలీ చేసింది.
IAS Surendra Mohan Promoted
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ (పోల్)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ ,సహకార శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్ రావును బదిలీ చేసి వాణిజ్య పన్నుల కమిషనర్‌గా నియమించారు. ఆయనకు రవాణా కమిషనర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. సహకార కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్‌గా కూడా ఆయన అదనపు బాధ్యతలు కొనసాగిస్తారు. జిల్లా పరిపాలనలో, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం. హరితను బదిలీ చేసి, సందీప్ కుమార్ ఝా స్థానంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమించారు. హరితను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా నియమించారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా ఉన్న సందీప్ కుమార్ ఝాను ఆర్ అండ్ బి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు.
Also Read : IPS Sajjanar Growth : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్
