Telangana Govt Shocking Decision : అమ్మ‌కానికి రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్లు

నోటిఫికేష‌న్ జారీ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

Hello Telugu - Telangana Govt Shocking Decision

Hello Telugu - Telangana Govt Shocking Decision

Telangana Govt: హైద‌రాబాద్ – రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స‌ర్కార్ ప్ర‌భుత్వ ఆస్తులు, స్థ‌లాలు, అపార్ట్మెంట్లు అమ్మ‌కానికి పెట్టింది. తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు రాజీవ్ స్వ‌గృహ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్మించిన అపార్ట్మెంట్ల‌ను అమ్మేందుకు నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది అధికారికంగా . స్క్వేర్ ఫీట్ కు రూ. 1150 చొప్పున రేటు నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ఖమ్మం నగరాన్ని ఆనుకొని పోలేపల్లిలో ఉన్న రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లు అమ్మేందుకు ప్రయత్నిస్తోంది.

Telangana Govt Key Updates

8 టవర్స్‌లో ఉన్న మొత్తం 576 ఫ్లాట్లను ఒకే యూనిట్‌గా అమ్ముతున్న‌ట్లు నోటిఫికేష‌న్ లో పేర్కొంది. అసంపూర్తిగా ఉన్న ఈ నిర్మాణాలను ఉన్నది ఉన్నట్టుగానే అమ్మాలని నిర్ణ‌యించింది. ఎస్ఎఫ్ఎ ధరను రూ.1150 కాగా మొత్తం ప్రాజెక్టు ధర రూ.87.41 కోట్లుగా డిసైడ్ చేసింది ప్ర‌భుత్వం.

వ్యక్తులు, సంఘాలు, బిల్డర్లు, డెవలపర్లు, జాయింట్ వెంచర్లుగా కలిసి మొత్తం 8 టవర్లను ఒకేసారి కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఆసక్తి ఉన్న వాళ్లు ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీలోగా రూ. 5 కోట్లు డీడీ తీసి స‌మ‌ర్పించాల‌ని కోరింది. డీడీని హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఉన్న తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాల‌యంలో అందించాల్సి ఉంటుందని తెలిపింది.

ఒకటి కంటే ఎక్కవగా సంస్థలు, సంఘాలు ఆసక్తి చూపితే లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేయనున్నట్టు స‌మాచారం.

Also Read : Minister Nara Lokesh – Google New Innovation : క్రియేట‌ర్ అకాడ‌మీ కోసం ఒప్పందం

Exit mobile version