EC : హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను నిర్వహించింది. ఫలితం కూడా ప్రకటించింది. అధికారంలో ఉన్న కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ముందుగా కేవలం గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు చేపట్టాలని డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఒకవేళ ఎన్నికలు నిర్దేశించిన సమయంలో నిర్వహించ లేక పోతే కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,000 కోట్ల నిధులు రాకుండా పోతాయి. ఇప్పటికే ప్రభుత్వాన్ని నడపడం కష్టంగా మారింది. కేవలం సర్పంచ్, వార్డు మెంబర్స్ ఎన్నికలు మాత్రమే చేపట్టాలని నిర్ణయించారు.
Telangana EC Ready for Local Body Elections
మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీసీలకు సంబంధించి 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది సర్కార్. ఇందుకు సంబంధించిన బిల్లు ఆగి పోయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని, కానీ చట్ట బద్దంగా ఇవ్వలేమంటూ పేర్కొంది. ఈ తరుణంలో కీలక ప్రకటన చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం (EC). స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు మరోసారి షెడ్యూల్‌ను ప్రకటించింది. నేటి నుంచి 23వ తేదీ వరకు ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలో రేపటి నుంచి అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమవుతుంది. అందిన ఫిర్యాదులు, అభ్యంతరాలను 22వ తేదీలోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక 23న తుది ఓటర్ జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Also Read : Nitish Kumar Oath Interesting : బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం


















