Telangana EC : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (Telangana EC) ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఈనెల 27న అధికారికంగా ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆయా ఎన్నికలు నిర్వహించే తేదీలను ఇప్పటికే ఖరారు చేసింది. కాగా చట్ట పరంగా 42 శాతం బీసీల రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టింది కోర్టు. ఈ సమయంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రావడంతో సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకంజ వేసింది. చివరకు ఉప ఎన్నిక జరగడం, అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో ఊపిరి పీల్చుకుంది. ఇదే ఊపును కొనసాగించేందుకు రెడీ అయ్యింది.
Telangana EC Gives Key Update on Local Body Elections
ఇక ఎన్నికల విషయానికి వస్తే కేవలం గ్రామ పంచాయతీలకు మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీల గుర్తులపై అభ్యర్థులు పోటీ చేయరు. కేవలం వ్యక్తిగతంగానే బరిలోకి దిగుతారు. ప్రస్తుతానికి సర్పంచ్ పదవులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు నవంబర్ 27న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. వచ్చే నెల డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుందని వెల్లడించింది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. నాలుగు రోజుల తేడాతో 2, 3 దశల ఎన్నికలు ఉంటాయని తెలిపింది.
Also Read : Nara Lokesh Praja Darbar Important Update : నారా లోకేష్ ప్రజా దర్బార్
