Falcon App Scam : ఫాల్క‌న్ యాప్ స్కామ్ లో రూ. 4,215 కోట్ల మోసం

సీఈవో ఆర్య‌న్ సింగ్ ను అరెస్ట్ చేసిన తెలంగాణ సీఐడీ

Hello Telugu - Falcon App Scam

Hello Telugu - Falcon App Scam

Falcon App : హైద‌రాబాద్ – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ఫాల్క‌న్ యాప్ (Falcon App) స్కామ్ కేసు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 4,215 కోట్ల మోసానికి పాల్ప‌డిన‌ట్టు గుర్తించింది. త‌క్కువ మొత్తంలో పెట్టుబ‌డి పెడితే చాలు ఒక‌టికి రూ. 100 ఇస్తామంటూ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. భారీ ఎత్తున డ‌బ్బులు కూడ‌గ‌ట్టారు. ఈ స్కామ్ కు సంబంధించి బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయ‌డంతో ప‌లు చోట్ల కేసులు న‌మోద‌య్యాయి. దీంతో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఫోక‌స్ పెట్టింది.

Falcon App Scam – CEO Aryan Singh Arrested

ఇదే స‌మ‌యంలో తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగింది. ఫాల్క‌న్ యాప్ స్కామ్ చోటు చేసుకుంద‌ని గుర్తించింది. పెద్ద ఎత్తున మోసం జ‌రిగింద‌ని తేల్చింది. ఈ మేర‌కు ఫాల్క‌న్ యాప్ సంస్థ సీఈఓ ఆర్య‌న్ సింగ్ ను అరెస్ట్ చేసింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రించింది. కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ గా త‌ను ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్నాడ‌ని, జూలై 4న పంజాబ్ లోని భ‌టిండాలో అదుపులోకి తీసుకున్ట‌న్లు వెల్ల‌డించింది. త‌న‌ను మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచామ‌ని, కోర్టు జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీకి పంపించిన‌ట్లు తెలిపారు సీఐడీ అద‌న‌పు డీజీపీ చారు సిన్హా .

ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్‌ను క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ ద్వారా రూపొందించారని పేర్కొన్నారు. ఇది ప్రఖ్యాత బహుళజాతి సంస్థల పేరుతో పెట్టుబడి పథకాలను తప్పుగా ప్రచారం చేసిందన్నారు. అధిక రాబడి హామీలతో ఈ యాప్ పెట్టుబడిదారులను ఆకర్షించిందన్నారు. భారతదేశం అంతటా 7,000 మందికి పైగా వ్యక్తుల నుండి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించార‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 4,065 మంది బాధితులు రూ. 792 కోట్ల‌ను కోల్పోయార‌ని చెప్పారు చారు సిన్హా.

Also Read : CM Revanth Sensational Announcement : మ‌హిళ‌ల‌కు 51 సీట్లు కేటాయిస్తాం – సీఎం

Exit mobile version