Telangana Cabinet : హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించడంతో దూకుడు పెంచింది. ఈ మేరకు సచివాలయంలో కీలకమైన మంత్రివర్గం సమావేశం (Telangana Cabinet) నిర్వహించింది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తే పెద్ద ఎత్తున స్థానాలను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గడువు ముగిసినా ఎందుకు స్థానిక సంస్థలను నిర్వహించడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో వైపు కాంగ్రెస్ సర్కార్ కు, ప్రధానంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చెంప చెళ్లుమనిపించేలా భారత దేశసర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏడాదిలో సెలబ్రేషన్స్ ఇంట్లో జరుపుకుంటావా లేక జైలులో ఉంటావా తేల్చుకో అని స్పీకర్ కు వార్నింగ్ ఇచ్చారు. ఒక రకంగా సర్కార్ కు బిగ్ షాక్ అని చెప్పక తప్పదు.
Telangana Cabinet Approved for Local Body Elections
అయినా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముందుకే వెళ్లాలని నిర్ణయించింది మంత్రివర్గం. ఈ మేరకు పచ్చజెండా ఊపింది. ప్రజా పాలన వారోత్సవాల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని తీర్మానం చేశారు. దీంతో షెడ్యూల్ విడుదల అనంతరం త్వరితగతిన ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనుంది సర్కార్. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనుంది.
Also Read : Minister Konda Surekha Clear Update : కొమురవెల్లి మల్లన్న కళ్యాణం ఘనంగా నిర్వహించాలి


















