Telangana – AP CM’s Important Meet : నీటి వాటాల‌పై రేవంత్, చంద్రబాబు చ‌ర్చ

కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి ఆధ్వ‌ర్యంలో భేటీ

hellotelugu-aptelanganacm

Telangana : ఢిల్లీ – కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం జ‌రిగిన ఉన్నత స్థాయి సమావేశం లో ఏపీ, తెలంగాణ సీఎంలు ఎనుముల రేవంత్ రెడ్డి, నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu) పాల్గొన్నారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాల‌కు చెందిన నీటి పారుద‌ల శాఖ మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, నిమ్మ‌ల రామానాయుడు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఉన్న‌తాధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ప్ర‌ధానంగా గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించారు.

Telangana and AP CM’s Meet

ఇదే స‌మ‌యంలో రాయ‌లసీమ‌కు నీళ్లు ఇచ్చేందుకు, దానిని స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించి బ‌న‌క‌చ‌ర్ల పేరుతో ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే కేంద్రం అనుమ‌తి కోసం డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) స‌మ‌ర్పించింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి తెలంగాణ ప్రాంతం నుంచి. ప్ర‌ధానంగా బీఆర్ఎస్ నాయ‌కులు త‌ప్పు ప‌ట్టారు. ఏపీకి మేలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని, ఈ ప్రాంత ప్ర‌యోజనాల‌కు భంగం వాటిల్లేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడ‌ని ఆరోపించారు.

ఇది పూర్తిగా తెలంగాణ‌కు గొడ్డ‌ని పెట్టు అని, బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు చేప‌డితే తెలంగాణ ఎడారి అవుతుంద‌ని, గోదావ‌రి, కృష్ణాలో నీళ్లు లేకుండా పోతాయ‌ని పేర్కొన్నారు. తాజాగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా చంద్ర‌బాబు నాయుడు ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్నారు. త‌న‌కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు క‌ళ్లు లాంటివ‌ని. కానీ 200 టీఎంసీల వాట‌ర్ ను ఎత్తుకెళ్లే ప్ర‌య‌త్నం మాత్రం మానుకోవ‌డం లేదు.

Also Read : CM Chandrababu Interesting Meeting : స్పోర్ట్స్ ఎకో సిస్టం ఏర్పాటుకు స‌హ‌క‌రించాలి – సీఎం

Exit mobile version