రేవంత్ రెడ్డిని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించ‌డం ఖాయం

తెలంగాణ విశ్లేష‌కుడు వి. ప్ర‌కాష్ షాకింగ్ కామెంట్స్

hellotelugu-VPrakash

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగ‌డం లేద‌ని రాచ‌రిక పాల‌న జ‌రుగుతోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ విశ్లేష‌కుడు వి. ప్ర‌కాష్ అన్నారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి, ఆయ‌న కుటుంబంపై అత్యంత జుగుస్సార‌క‌ర‌మైన రీతిలో, యావ‌త్ తెలంగాణ ప్ర‌జానీకం సిగ్గుతో త‌ల దించుకునేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడ‌టం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం వి. ప్ర‌కాష్ మీడియాతో మాట్లాడారు. 15 ఏళ్ల‌కు పైగా ప‌ద‌వుల‌ను వ‌దులుకుని పోరాటం చేస్తేనే తెలంగాణ వ‌చ్చింద‌న్న సోయి లేకుండా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు . ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇలాంటి దిగ‌జారుడు రాజ‌కీయాల‌ను తాను ఎన్న‌డూ చూడ‌లేద‌ని అన్నారు వి. ప్ర‌కాష్‌.

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అనేది అత్యంత ముఖ్య‌మైన‌ద‌ని, నాలుగు కోట్ల ప్ర‌జానీకానికి జ‌వాబుదారీగా ఉండాల్సిన వ్య‌క్తి ఇలా నీచాతినీచంగా మాట్లాడ‌టం స‌బ‌బు కాద‌న్నారు. హోం శాఖ‌తో పాటు విద్యా శాఖ నిర్వ‌హిస్తున్న రేవంత్ రెడ్డి ప్ర‌తి ఒక్క‌రు త‌ల దించుకునేలా కామెంట్స్ చేశార‌ని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్ర‌జ‌లు, ముఖ్యంగా మ‌హిళ‌లు త‌న‌ను చూసి బాధ ప‌డుతున్నార‌ని అన్నారు వి. ప్ర‌కాష్. రేవంత్ రెడ్డి తెలంగాణ వాడు అని చెప్పుకోడానికి సిగ్గుగా ఉందన్నారు. ఇంత గొప్ప తెలంగాణను ఒక దౌర్బాగ్యుడి చేతిలో పెడితే ఫలితం ఇలానే ఉంటది అనిపిస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డి బిడ్డను అన్నారని ఒక మీడియా సంస్థని జైలులో పెట్టాడు.. ఆ మాత్రం ఓర్చుకొని లేని వ్యక్తి ఇంకొకరి గురించి ఎలా అంటాడని ప్ర‌శ్నించారు. తెలంగాణకు ఆయన ఒక శని అది పోతే కానీ మనం బాగుపడమని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు వి. ప్ర‌కాష్.. ఆ శని దాని అంతటా అదే పోతే పర్లేదు కానీ ప్రజలు చెప్పులతో కొట్టి వెళ్లగొడితే బాధగా ఉంటుందన్నారు.

Exit mobile version